సోయిదప్పిండ్రు
సోయిదప్పిన బతుకులిపుడు
బంగారు తెలంగాణలో
గవర్నమెంట్ గాసగాళ్ళ జీవితాలు పెరగవట్టే
పెరగవట్టే జీతాలు,
దీనం పత్రికల్లా టీవీలల్లా
యాడన్న ఎపుడన్న గని
ఎన్నికలస్తే దొర గొంతులనుంచి
సొల్లు జాలువార్తుంటే
సెవులకైతే పండుగొస్తదిలే
పండుకుంటే గూడంగా
కంటికి కునుకువట్టక కలతనిద్రొస్తదిలే
జనమంతా జీతాలు పెంచిండనుకుంటనే
బయట ధరలనన్ని ఆకాశానికి తాకిస్తరు
దొరదెబ్బకు పగలే సుక్కలుగాన్రావట్టే
రైతుబందుమీద కుర్చేసుకుని అధికారం చెలాయిస్తున్నడు
సోంఛాయించేదేంలేదు
గరిబోళ్ళ బతుకులకు అతుకులేస్తున్నడు
అన్నే గూసవెడుతుండు
ఎన్ని గొప్పల్జెప్పుకున్నా
భవిష్యత్తుల బంగారమేమోగని
అప్పుల తెలంగాణయితే
నూటికి నూటొక్కశాతం అయితీర్తదిరోయ్
సదువుకున్న పోరగాళ్ళంతా పోకిరిల్లాగా తిరగవట్రి
సంపాదించిన డిగ్రీలకసలు విలువలేక దినసరికూలీలైరి
కలల తెలంగానలో
పగటికలలై బతుకు బరువై పానాలుదీసుకుని చావవట్టిరి
ఎట్టిసాకిరి జీవితాలాయే
మార్పు రావాలిపుడే
జెండమారాలే
బానిసలంగాదు
చెవులకు కమ్మనిమాటలగాణదు
గావల్సిందిపుడు
కడుపులగ్గావాలే ఎరుక మరవకండ్రి
--- సి. శేఖర్ (సియస్సార్),
పాలమూరు,
9010480557.