ప్రబోధం.. గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా .సెల్ నెంబర్ 9491387977..

ప్రబోధం.. గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా .సెల్ నెంబర్ 9491387977..

🙏🏼🙏🏼🙏🏼 ప్రబోధం🙏🏼🙏🏼🙏🏼_
________☘️_______________

రండి రండి రండి మా మాటను వినుకోండి
మా భరతమాత ప్రియమైన పుత్రులారా
లెండి లెండి లెండి మీరుకూడ వినుకోండి
ఓ భారతీయ మామంచీ మిత్రులారా!

వ్యాపారం ముసుగేసుక ఆంగ్లేయులు మనదేశం వచ్చిరి
అధికారం మాదని గిరగీసుక
పరిపాలన చేయ వారు సచ్చిరి

భారతీయులను అష్టకష్టాలు బెట్టిరి
కారాగారంలో బెట్టి హింసించబట్టిరి
మన జాతిపిత గాంధీజీ గమనించె
స్వాతంత్ర పోరాటంతాను జరిపించె

అహింసా ఆయుధాన్ని చేత బట్టె
ఆంగ్లేయులను తాను వెల్లగొట్టె
హింసలేని విల్లును సంధించే
స్వాతంత్ర్యాన్ని మనకు అందించె!

సత్యమనే ఆయుధాన్ని పట్టమనీ చెప్పె
అసత్య దైత్య శక్తుల గుట్టు తాను విప్పె
ఉవ్వెత్తున తల ఎత్తుక నడవమన్నడు
దేశం కోసం ప్రాణమైన విడవమన్నడు!

సత్యధీక్ష వ్రతాన్ని తాను చేయించే
నిత్యగ్రహశోధన దారినిచూయించే
ఆశయాల తీరం చేరాలని చెప్పే
సంశయాలవరం గుట్టుతాను విప్పే!

బాపూజీ బాటలోనే నడవాలండి
దేశం కోసం ప్రాణమైన విడవాలండి
ఇది మనంపుట్టిపెరిగినమన దేశం
అందిద్దాం అందరం ఓశుభసందేశం

మీ................................
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూల్ జిల్లా.
సెల్ నెంబర్, 9491387977.

0/Post a Comment/Comments