ఓ సఖి నా చంద్రముఖి. లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా సెల్ నెంబర్ 9491387977. తెలంగాణ రాష్ట్రం.

ఓ సఖి నా చంద్రముఖి. లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా సెల్ నెంబర్ 9491387977. తెలంగాణ రాష్ట్రం.

సఖీ ఓ నాచంద్రముఖీ
-------------------------------
సఖీఓ ప్రియ సఖీ నా శ్రీముఖీ
నా ముద్దు మురిపాల చంద్రముఖీ
అందుకో నా యోగ క్షేమాల లేఖ
పొందుకై ఆశించి వ్రాస్తున్నా నేనిక!

ఆషాడ మాసం అని నీవన్నావు
ఆశదోష అప్పడంఅనితప్పుకున్నావు
కొత్తగా పెళ్లైన జంటలకు మన పెద్దలు
సుతిమెత్తగా ఎడం కై చెప్పినవే ఈ సూద్దులు

మన ఆచార వ్యవహారాల మనం 
తప్పక పాటించాలి గా అనుదినం
అనుకుని పంపించా మీతల్లిగారింటికి నిన్ను
కనుగొని రాస్తున్నది ఈ లేఖను నా పెన్ను

నిత్యం కలలోకి వస్తున్నవు మస్తున్నవు
నీ అందాలను ఆరబోస్తూ కవ్విస్తున్నవు
చిక్కినట్టే చిక్కి చెక్కిలిగిలి నువు 
 పెట్టి
గట్టి ముట్టి పట్టు తప్పి గందరగోళం చేస్తున్నావు

ఆషాడ మాసం పోయినంక వస్తానంటివి
ఆ ఆశతోనే ఒప్పుకొని నే గమ్మునుంటిని
ఆషాడం పోయి ఆరువారాలై పోయెను
నీవు వచ్చు జాడఏమాత్రం లేకపోయెను

నీ రాక కోసం కన్నుల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంటిని
ఈ పూటో ఆపూటో వస్తావని కాపలా కాస్తుంటిని
కనురెప్పలు అలసిసొలసి మూతపడి పోతున్నవి
దాగుడుమూతలు ఆడకుండా దగాపడిచూస్తున్నవి

ఇక లేఖ ఆసాంతం చదివి వస్తావని ఆశిస్తా
నీవు రాకుంటే నేనే ఇక నీ వద్దకు వస్తా
ఇన్నాళ్లు నే పడిన బాధ నీకు తెలియజేస్తా
ఎన్నాళ్లో నే దాచుకున్న ముద్దులన్ని
నేమూటగట్టి ఇస్తా!
 మీ
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూలు జిల్లా.
సెల్ నెంబర్.9491387977.

0/Post a Comment/Comments