ఏం మనుషులు? ఏం మనసులు.?.గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. సెల్ నెంబర్.9491387977.

ఏం మనుషులు? ఏం మనసులు.?.గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. సెల్ నెంబర్.9491387977.

ఏం మనుషులు-?
------------------
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
చెడ్డ పనులు చేసేటి దొడ్డ మనుషులు
అసలు వీరు ఎంత చెప్పినా వినరు
సిసలయిన దారిని వారే మాత్రం కనరు !

ఏం మనుషులు వీరివి ఏం మనసులు
కోతులు కోసేటి ఈ కోతి మనుషులు
కొంపకు నిప్పెట్టి చుట్టలు ముట్టిస్తరు
చంపకుచుక్కెట్టి బట్టలు కట్టిస్తారు !

ఏం మనుషులు వీరివి ఏం మనసులు
ఓట్లకై సీట్లకై పోటీ చేయు మనుషులు
నిల్చొని నోట్లు పంచుతుంటారు
గెల్చినపిదప కోట్లు దండుకుంటరు!

ఏం మనుషులు వీరివి ఏం మనసులు
లాయర్లైన కొందరు లైయ్యరు మనుషులు
అన్యాయానికి హాజరు వేస్తుంటారు
ఆ న్యాయానికేమో గైర్హాజరు ఔతుంటరు !

ఏం మనుషులు వీరివి ఏం మనసులు
రౌడీ లైన కొందరు దౌర్జన్యం మనుషులు
మానవత్వాన్ని మంట కలుపుతున్నారు
దానవత్వంన్ని ఇంట తెలుపుతున్నారు !

ఇలాంటి మనుషుల ఒక చోట చేర్చి
మంచిచెడుల అంశాన్ని వారికి వివరించి
వారిలో తేవాలి ఎలాగైనా మార్పు
జనం మెచ్చుకొని ఇస్తారు లే ఓ చక్కని తీర్పు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments