ప్రజాకవి మన కాలోజీ (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రజాకవి మన కాలోజీ (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రజా కవి మన కాళోజీ (వ్యాసం).
-------------------------------------------
పోరాటాలే తన ఊపిరిగా చేసుకుని జనం గుండెల్లో పదిలంగా జీవించిన మన తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ నారాయణరావు గారు. ఆయన  మన తెలంగాణ ప్రజల నవ సమాజ నిర్మాణ చరిత్రను సృష్టించిన సృష్టికర్త. ప్రజాస్వామిక ప్రవక్త. మానవ సమాజ మహోన్నత మానవతావాది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పరితపించిన పౌరహక్కుల ఉద్యమ నేత. ఉద్యమం, కవిత్వం రెంటినీ రాజ్యంపై ధర్మ పోరాటానికి తన ఆయుధాలుగా మలుచుకున్న సహన సమరశీలి.

             కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని "రట్టిహళ్ళి"అను గ్రామంలో రమాబాయమ్మ కాళోజీ రంగారావు దంపతులకు జన్మించాడు. నేటి వరంగల్లు జిల్లాలోని "మడికొండ"గ్రామానికి వలస వచ్చి స్థిరపడినారు. 1940 బ్రో వీరికి రుక్మిణీ బాయి కి వివాహం జరిగింది.
        ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక యోని చెప్పిన ఆయన ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్లం, తెలుగు భాషల్లో పలు రచనలు చేశారు. మరో ప్రక్క తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా 1953 నా ఎన్నికై 1958 లో ఉపాధ్యాయ నియోజక వర్గం నుండి శాసన మండలికి ఎన్నికైనారు.
               
ఆయన సాహిత్య రచనలు
------------------------------------
1). అణా కథలు. 2). నా గొడవ.
3). నా భారత దేశ యాత్ర.
4). ప్రార్థీవవ్యయం.
5) కాళోజి కథలు.6) ఇది నా గొడవ.7). తుది విజయం.
8) తెలంగాణ ఉద్యమ కవిత.
9) బాపూ బాపూ బాపూ.
10). జీవన గీతం.

పురస్కారాలు--గౌరవాలు.
---------------------------------
1992లో పద్మ విభూషణ్. మన మన భారత ప్రభుత్వం చే పొందారు. 1972లో భారత ప్రభుత్వంచే తామ్రపత్రం పురస్కారం. 968 లో ఆయన జీవన గీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అనువాద పురస్కారం పొందారు. ప్రజాకవి అనిబిరుదు కూడా పొందినారు.
బూరుగుల రామకృష్ణా రావు మెమోరియల్ చే మొదటి పురస్కారం పొందినారు. ఆ తర్వాత రామినేని పౌండేషన్ అవార్డు, గాడిచర్ల పౌండేషన్ అవార్డు 1992లో డాక్టరేట్ పట్టాను కాకతీయ విశ్వవిద్యాలయము వరంగల్ చేత పొందినారు. 1996లో సహృదయ సాహితి వారి గురజాడ అవార్డు, కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారములు పొందినారు.

ఉద్యమ సంబంధాలు
-----------------------------
ఉద్యమ శక్తి అయిన కాళోజి ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభ, క్విట్ ఇండియా, కమ్యూనిస్టు ఉద్యమాలలో మమేకమై పోరాటాలు చేస్తూ 19 69 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూరుగుల రామకృష్ణా రావు, పీవీ నరసింహారావులతో కలసి ఉద్యమాలలో పాల్గొన్నారు.

ముగింపు
---------------
ఉద్యమశీలి అయిన మన కాలోజీ నారాయణ రావు శిలా విగ్రహాన్ని మన భాగ్యనగరి యందు నెలకొల్పాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఆ దిశలో అడుగులు పడినట్లు ఇప్పటి వరకు మనకు దాఖలాలు లేవు. అంతేకాకుండా ఆయన చేసిన ప్రసంగాలు, పలు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లు, ఆయన మిత్రుల జ్ఞాపకాలను ముందు తరాల వారికి అందించే ప్రయత్నం కూడా జరిగినట్లు కానరావడం లేదు. కావున మనం మన రాష్ట్ర మందున్న అన్ని సాంస్కృతిక సంఘాలు, మన రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేయాలని, ఆ దిశగా ప్రయత్నించి చి విజయాన్ని సాధించాలని మనం కోరుకుందాం.

 గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూలు జిల్లా.
సెల్ నెంబర్.9491387977.

0/Post a Comment/Comments