అమాయకులం- అనామకులం
-------------------------------------------
పాల పళ్ళ పిల్లలం
తేనె కళ్ళ మల్లెలం
పాలకొల్లు వారలం
పాలవెల్లి పొరలం !
అమ్మ లేని కూనలం
నాన్న లేని జానలం
బక్కచిక్కిన బాల్యం
బిక్కచచ్చిన మూల్యం !
అమ్మానాన్నలు లేక
చదువుసంధ్యలు రాక
అమాయకులై మిగిలాం
అనమకులై మెలిగాం !
మేం కాగితం పడవలు చేసి
మాఇసుక కుప్పలు జమచేసి
పిచ్చుక గూళ్ళును కట్టేస్తాం
పచ్చిక మళ్ళనూ పెట్టేస్తాం !
గోలి కాయ ఆటలు ఆడుతాం
లాలి పాప పాటలు పాడుతాం
వాటివల్ల పోవు మాకు పొద్దు
వీటివల్ల ఆరోగ్యం మాకు కద్దు !
ముద్దుగా మా సద్ది బువ్వ తింటం
బుద్ధిగా మా పనులకు పోతుంటం
నప్పే యజమాని మాటనే వింటం
చెప్పే పనులను మేము చేస్తుంటం!
మా అమ్మా నాన్నల పూజిస్తాం
మాకున్న పెద్దలను మేం ప్రేమిస్తాం
మా దేశం కోసం మా ప్రాణం ఇస్తాం
ఆ ఆశా శ్వాసతో మేం ఇక జీవిస్తాం
తగిలిన గాయాలను మోస్తుంటం
వెలిగిన గేయాలుగ మలుస్తుంటం
ఒరిగే వెతలను మేము చూస్తుంటం
జరిగే కథలుగా వాటిని వ్రాస్తుంటం!
సాహితీ సభలల పాల్గొంటం
సాహితీప్రియులను కన్గొంటం
మా కవితలు కథలు వినిపిస్తం
మేం కవి పండితుల మేప్పిస్తం !
మేము రాసిన కవితలు కథలు
మా బడాబాబులు కొంటుంటరు
కొంత సొమ్ము మాకిచ్చుకుంటరు
సొంత పేరుపైవారచ్చేసుకుంటరు !
ఏది ఏమైతేనేమి ఓ స్వామి
పేరు ఎవరికి వస్తే మరిఏమి ?
మకు దొరుకుతుందిగా భృతి
మా జీవితానికి కల్గు ఓ ఆకృతి!
మా గుజ్జనగూళ్ళను మేం కట్టేస్తాం
మా గూటిలోఒజ్జకు దీపం పెట్టేస్తాం
మా బుజ్జి గణపతినిమేం పూజిస్తాం
మా భజన బృందమును ప్రేమిస్తాం!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.