🇪🇬🇪🇬 జయహో మహాత్మా🇪🇬🇪🇬
జయహో జయహో మహాత్మా
జయవిజయీభవ మా పరమాత్మా
మాభారత ప్రజలందరి నేతవు
మా హారతి గైకొను శాంతి దూతవు
పోరుబందరులో నువు పుట్టి పెరిగి
పోరుసల్పుతూ నడుం కట్టి తిరిగి
అహింసా ఆయుధాన్ని చేత బట్టి
పోరాటం జరిపారు ప్రతిన బట్టి
ఆంగ్లేయుల మెడనులను వంచావు
మాదాస్యశ్రుంకలాలను తెంచావు
కుతంత్రాన్ని అహింసాతో బందించి
స్వాతంత్రాన్ని మా కందించి నారు.
బొల్లిగద్ద రివ్వున వచ్చి కోడిపిల్లను
తన్నుకెళ్ళిదవ్వున తీసికెళ్ళి నట్లుగ
ఆంగ్లేయులొచ్చిరిగా దొంగచాటుగా
దేశసంపదకొల్లగొట్టిరున్నపాటుగా
బారతీయులయోగక్షేమాలాసించి
మాదేశంవదలిపోవాలనిశాసించి
అహింసా సమరశంఖం పూరించి
స్వాతంత్ర్యాన్ని మాకందించావు
మా దేశం స్తితిగతులనీవాలోచించి
రాత్రింబవళ్ళు బాగాఅవలోకించి
సత్యాగ్రహ జ్యోతినివెలిగించావు
నిత్యగ్రహబాదల తొలగించావు.
----- గుర్రాల లక్ష్మారెడ్డి,
కల్వకుర్తి, సెల్.నెం.9491387977.