సోంచాయించేయాలే
అరే మస్తున్నది
గిపుడున్న నాయకుల
రాజకీయ ఓట్లాట
యాడజూసినగని
అంబేద్కర్ కాన్రవట్టే
పేదోళ్ళ పేరు మళ్ళమళ్ళ పలకవట్టిండ్రు
మీటింగులువెట్టి
కుర్చిలమీద గూసవెట్టి
ఉత్తుత్త ముచ్చట్లు అచ్చుగుద్దినట్లు పాతమాటలే
మస్తు మాట్లాడవట్టిండ్రు
గణతంత్ర దినాన కనవడని
అంబేడ్కర్ బొమ్మ గీయాల
యాడజూసినగని పెద్దపెద్ద సైజులో కనవడవట్టే
నవ్వుకుంట నవ్వుకుంట
దళితులకు
మూడుకరాలిస్తనే
ముఖ్యమంత్రి జేస్తనే
గిపుడు కొత్త ముచ్చట
పదిలచ్చలిస్తడంట దళితులకు
ఎంత పేమా
నమ్మలేని నిజాలని నవ్వుకుంట జెప్పవట్టే
ఎరుకమరిసి ఓటేస్తే
ఎంగిలిస్తరాకులా చెత్తకుప్పల్లో
బతుకు ఎత్తుకోవాలే
ఎవరిసొమ్ము ఎవరికియబట్టే
తాయిలాల బాయిలవడితే
బయటికిరానికే తరాలు గావలే
జర సోంచాయించేయాలే ఓటు
సి. శేఖర్(సియస్సార్),
9010580557.