సీతాకోక చిలుక..ఎదారు లేదిక..!
రంగు రంగుల..
సీతాకోక చిలుకలు..!
రకరకాల అల్లికలతో స్వంతంగా
అల్లుకున్నట్టుగా..
ఏమి,
వయ్యారాలు..!
ఏమి,
రెక్కల ఊగడాలు..!
ఏమి,
గాలిలో..ఆ విహరింపులు..!?
గుంపులు గుంపులుగా
ఇష్టమొచ్చినట్లు..
తిరుగులాటలు!
మదిలో ఎనలేని ఆనందం
నింపు కున్నట్టే ననిపిస్తోంది..!
ఆహా ఏమి ఈ, ఆనందం,సంతోషం..!??
ఎలాంటి, ఎదారు లేకుండా
ఎంత స్వతంత్రంగా జీవిస్తున్నాయి..గదా,
ననిపించక మానదు.., ఎవ్వరికైనా..!??
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.