"అచ్చ జానపదుడు - వంగపండు" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"అచ్చ జానపదుడు - వంగపండు" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

అచ్చ జానపదుడు - వంగపండు


రైతు కుటుంబాన జన్మించిన
జానపదగాయకుడు
శివుని నిరాడంబరత మెచ్చిన
శివభక్తుడు
దైవత్వమంటే ఆపదలో
సాటిమనిషికి సాయపడడం అని
ఆకలి బాధ అనుభవించినా
ఆత్మాభిమానం చంపుకోకూడదన్న
నగ్న సత్యాన్ని తెలిపిన మేధావి
ఉద్యమమే ఊపిరిగా జీవించిన
ఉత్తరాంధ్ర గద్దర్
యుద్ధ శిక్షణ పొందిన సైనికుడు
జననాట్యమండలి సంస్థాపకుడు

లల్లాయపదాలతో
గిరిజన మాండలికపదాలతో
ఏం పిల్లడో ఎల్లమొస్తవ
యంత్రమెట్ట నడుస్తు ఉందంటే అంటూ
ఉత్తరాంధ్ర పదాలకు
గజ్జెకట్టి ఆడిపాడగా
ఎర్రదండు ఉరకలేసింది
జనందండు ఉర్రుతలూగింది

మూర్తీభవించిన మానవతావాది
ప్రజాగేయాలను రాసి ఆడిపాడిన
జానపద కళాకారుడు
కళారత్న, బొల్లిముంత శివరామకృష్ణ
సాహితీపురస్కారం పొందిన
అచ్చ జానపదగాయకుడు 
జనపదాలకు బాణీలుకట్టి
జానపదుల గుండెల్లో
నిద్రపోయిన వంగపండు
చిరస్మరణీయుడు


ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments