జనం-వనం
మన జీవన గమనం చెట్టు
తరతరాలకు ఆయువు పట్టు
మనకు ప్రాణవాయువు నిచ్చు చెట్టు
కన్నతల్లి వలె కాపాడే కల్పతరువు
కాలుష్య కోరలను తగ్గించే తరువు
ఈ ధరణి పై అవుతుంది కరువు
రాబోయే కాలం గడ్డుకాలం కానున్నది
తరువులు తగ్గితే ఊపిరి కి కరువవనున్నది
పుడమి పుట్టువు లేకపోతే
పుడమి కి జీవం లేదు
జనాభా పెరిగితే తప్పవు తిప్పలు
బతకడానికి కనబడును ఎన్నో చుక్కలు
సతమతమయ్యేరు ప్రాణవాయువు అందక
మానవాళికి తప్పవు ఇంక వీపు పై మొక్కలు
ఇక ఏ వైపో జనవాళీ మరి
అందుకే నాటండి మొక్కలు పడి పడి
ఒక్కో మొక్క ఒక్కో వృక్షమై
కాపాడును మానవాళిని ఆ జన్మాంతం
మానవులందరం ప్రతిజ్ఞచేద్దాం
ఈ ధరణిపై చేద్దాం జనం వనం సమతుల్యం.
*************************************
పేరు: ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు:హైదరాబాద్
వృత్తి:బిజినెస్ కన్సల్టెంట్