ఎంతటి కాల మహిమ..!? ---ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

ఎంతటి కాల మహిమ..!? ---ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

ఎంతటి కాల మహిమ..!?

మానవత్వం నశిస్తూ, మృగత్వం అవతరిస్తున్న తరుణమిది..!?
జాలి, కరుణ, దయలు,
మాయమై, హింసా దౌర్జన్యాలు ఉద్భవిస్తున్న కలికాలమిది .!?
ప్రేమ,అనురాగ,బాంధవ్యాలు దూరమై,
ఈర్ష్యా,ద్వేషాలు..దగ్గరవుతున్న దారుణ సమయమిది..!?
ఆశీర్వచనాలు,ఆశీర్వాదాలు
మేలు కోరు మాట లు,అదృశ్యమై,కోపాలు,తాపాలు,శాపాలు ప్రకటిస్తున్న 
చండాలపు కాలమిది..!?
సహాయం చెయ్యవలసిన చోట,వెన్ను పోటు పొడిచి,
అమాయకంగా కనిపించే అవకాశ వాదుల కల్తీ,కాలుష్య కాలమిది..!?
స్వార్థం నిలువెల్ల ఉంచుకొని,
ఉన్నకాడికి దోచుకొనే, దొంగ
మోసగాళ్ళ,
దొరకని దొంగల దరిద్రపు కాలమిది..!??
తెరముందు మంచిగా,
తెర వెనుక చెడుని పెంచుతూ.. 
పతనాన్ని ఆశించే.. 
కాపట్య
నటీ నటుల దౌర్భాగ్య కాలమిది..!??
ఏం కాలమిది..!?
ఎంతటి కాలమిది..!??

రచన:✍🏻విన్నర్
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments