" నగ్న సత్యాలు "--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు ,ఎమ్మిగనూరు

" నగ్న సత్యాలు "--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు ,ఎమ్మిగనూరు

" నగ్న సత్యాలు "
------------------------
అందమైన గురువింద
దానికుంది మచ్చ కింద
ఎంత వారికైనా మహిని
ఉండదా? కొరత మదిని

ముద్దులొలికే గులాబీ
ముల్లు ఉంది దాని కింద
మహనీయుడు మనిషి కూడా!
మరణం రుచి చూడడా?

తీపి గొంతు కోకిలకు
తనువంతా నలుపుంది
చక్కనైన చంద్రునికి
ఆయుస్సు క్షీణతుంది

సృష్టిలో అన్నింటికీ
ఏదో ఒక లోపముంది
వాటిని అధిగమిస్తే
గౌరవం దక్కుతుంది
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు.

0/Post a Comment/Comments