మూఢనమ్మకాలు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్)

మూఢనమ్మకాలు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్)

 మూఢనమ్మకాలు

పెద్దలు ఆచరించిన కొన్ని పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలే మూఢనమ్మకాలు
పెద్దలు మాటలు పెరుగన్నం మూటలు కానీ అన్ని వేళలా అది సరికాదు
రాకెట్ యుగంలో ఉన్న మనం
రాతియుగం నాటి కొన్ని మూఢనమ్మకాలు విడవాలి

చిల్లంగి బాణామతి క్షుద్రపూజలు వగైరాలాంటివి ఆశాస్త్రీయమైన నమ్మకాలు
హిస్టీరియా వచ్చిన మనిషి ఏవేవో మతిలేని మాటలు ఆడటం లేనిపోని చేష్టలు చేయడం 
కానీ మనం దీనిని మూఢనమ్మకం తో దెయ్యామని భూతమనినమ్మడం
జీవి ప్రాణాలు పై తెచ్చుకోవడం ఇది మూఢనమ్మకం

పసరవైద్యం మంచిదే
కానీ అన్ని వేళలా సరికాదు
కషాయం మంచిదే
కానీ అన్ని సందర్భాలలో శ్రేయస్సు కాదుకానీ నేడు కాలం మారింది వాతావరణం మారింది
ఆహారపు అలవాట్లు మారాయి
ఈ సందర్భం లో ఇప్పుడున్న శాస్త్రీయ పద్దతులే సముచితం

ఇంతకు ముందు 104 జ్వరం వచ్చిన కొన్ని ఇంటి చిట్కాలు ద్వారా జ్వరం మాయం
కానీ నేడు అలా చేస్తే మనిషి పోవడం ఖాయం

అందువలన మార్పులు కాలానుగుణం
మనిషి కూడా ఉండాలి దానికి అనుగుణం
ఆశాస్త్రీయం వద్దు శాస్త్రీయం ముద్దు
విడిచిపెట్టండి మూఢనమ్మకాలు
పెంచుకోండి విశ్వాసం శాస్త్రీయ దృక్ఫధాలు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
          విజయనగరం జిల్లా
          9441530829


0/Post a Comment/Comments