దేశమంటే మనుషులోయ్ సత్య మొం డ్రెటి

దేశమంటే మనుషులోయ్ సత్య మొం డ్రెటి


దేశమంటే పౌరులు

 దేశమంటే మనుషులోయ్
మనుషుల్లోని స్వతంత్ర భావనలు
దేశం కోసం చేసే త్యాగాలు
ఉన్నత వ్యక్తిత్వాలు
ఉపఖండ సంస్కృతి సంప్రదాయాలు
దేశమంటే వేదభూమి
అష్టాదశ పురాణాలు పుట్టిన భూమి
దేశమంటే జీవ నదీప్రవాహం
హిమాలయాల ఔన్నత్యం
దేశమంటే ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించేది.... నిస్వార్థ ప్రజా పరిపాలన.... దేశమంటే హక్కులు బాధ్యతలు సక్రమ నిర్వహణ..... జాతి మత కుల వివక్ష లేనిదే దేశం
పరాయి పాలనలో ప్రజలు నిస్వార్థ జీవులు... స్వాతంత్రమే వారి లక్ష్యం.... స్వాతంత్రపాలన లో..... అవినీతి బంధుప్రీతి లంచగొండితనం.. కుల మత కొట్లాట....
స్వతంత్ర సమర వీరుల త్యాగఫలం ఇదేనా ఇది కాదు దేశం అంటే
అన్నదమ్ముల వలె అక్కచెల్లెళ్లు వలె ఐకమత్యంతో మెలగాలి దేశ ప్రజలు అభ్యుదయానికి పాటుపడాలి.. ప్రగతి పధంలో 
ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి
ఆర్థిక అసమానతలు తొలగి
నా దేశం విజయపతాకం  ఎగరాలి అది యే దేశం అంటే అదియేనా స్వర్ణ భారతదేశం...
జై భారత్ జై జై భారత్..


పేరు ;శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు :హైదరాబాద్

0/Post a Comment/Comments