*పాలమూరు*
పల్లెకు నిర్వచనం
పాలమూరోళ్ళనే అడుగు
పిడికెడు బువ్వ పుట్టక
పీనిగలై తిరిగినోళ్ళు
పుట్టెడు దుఃఖాన్ని మోసుకుంట
పూణె,బొంబైలు వలసవోయినోళ్ళు
పెద్దపెద్ద భవనాలకు పునాదులేసినా
పేగు నింపుకోలేని అభాగ్యులు
పైసా జేబులుంటే నవాబులమన్కునే పసిమనస్కులు
పొద్దుతోని పోటీవడి గొడ్లలాక పనిజేసుడేగాదు
పోరువిత్తనాలు జల్లి
పౌరుషంగా మీసంమెలేయడంలో
పండుగసాయన్నలు వాళ్ళు.
పాలమూరోళ్ళనే అడుగు
పిడికెడు బువ్వ పుట్టక
పీనిగలై తిరిగినోళ్ళు
పుట్టెడు దుఃఖాన్ని మోసుకుంట
పూణె,బొంబైలు వలసవోయినోళ్ళు
పెద్దపెద్ద భవనాలకు పునాదులేసినా
పేగు నింపుకోలేని అభాగ్యులు
పైసా జేబులుంటే నవాబులమన్కునే పసిమనస్కులు
పొద్దుతోని పోటీవడి గొడ్లలాక పనిజేసుడేగాదు
పోరువిత్తనాలు జల్లి
పౌరుషంగా మీసంమెలేయడంలో
పండుగసాయన్నలు వాళ్ళు.
- ఇంజమూరి మహేష్ యాదవ్
ఎం.ఏ ద్వితీయ సంవత్సరం
ఉస్మానియా విశ్వవిద్యాలయం.