అయినా,లోకం
మాకిచ్చిన బిరుదు మాత్రం పాలమూరు లేబరు
బుక్కెడు బువ్వకోసం
మేంబడ్డ గోస చూసి
అయ్యో పాపం!అన్నోడేతప్ప
ఆదుకున్న నాదుడులేడు
సుట్టుముట్టు నీళ్ళెన్ని వున్నా
మా పొలాల దూప తీరింది మాత్రం
రాలిన మా కన్నీళ్ళతోనే
అయినా,
నా పాలమూరు తల్లీ పసిడి గుండె గల్లది
పల్లెరుగాయల మింగి పల్లీలను ఎల్లగక్కింది
చెమటను చల్లితే బువ్వనుగన్నది
నెత్తురుజల్లితే పోరునుగన్నది
నా తల్లీ...
తరాలపాటు వంఛనకు గురై
వలసల జిల్లాగా అవమానించబడ్డది
-ఇంజమూరి మహేష్ యాదవ్
కర్నూలు.