జయశంకర్ ఆశయ సాధన - నేటి తరం కర్తవ్యం:

జయశంకర్ ఆశయ సాధన - నేటి తరం కర్తవ్యం:

- మార్గం కృష్ణమూర్తి

అంశం: జయశంకర్  ఆశయ సాధన - నేటితరం కర్తవ్యం:


ప్రక్రియ: బుల్లెట్ పాయింట్స్

నమ్మిన సిద్ధాంతం!
జయశంకర్ పంతం!!

తెలాంగానే  ఆశ!
తెలాంగానే శ్వాస!!

విశాలాంధ్ర వ్యతిరేకుడు!
తెలంగాణ ఆకాంక్షకుడు!!

రాష్ట్రవిభజన  రూపకర్త!
తెలంగాణా సిద్ధాంతకర్త!!

జయశంకర్ విద్యావేత్త!
తెలంగాణ  జాతిపిత!!

కెసిఆర్ తో కలిశాడు!
తండ్రి కొడుకుల్లా మెదిలాడు!!

నీళ్ళునిధులు  నియామకాలు!
జయశంకర్ ఆశయాలు!!

అందరినీ ఏకంజేసే!
రాష్ట్రమంతా  జాగృతంచేసే!!

తెలంగాణాకు కృషిచేయాలనే!
అందరూ ఫలాలుపొందాలనే!

ప్రణాళికలు వేశాడు!
ప్రాంతాలన్నీ తిరిగాడు!!

ఆంధ్రులను కలిశాడు!
సభలలో మెప్పించాడు!!

మేధావులకు వివరించాడు!
జేఏసిని  ఏర్పాటుచేశాడు!!

మీటింగులెన్నో  పెట్టాడు!
యువతరం వెన్నుతట్టాడు!!

గల్లీ సభలకు వెళ్ళాడు!
డిల్లీ సభలకు  వెళ్ళాడు!!

అవమానించినా సహించాడు!
అదిరించినా బెదరకున్నాడు!!

తెలంగాణ సాధించాడు!
దిగ్విజయం గావించాడు!!

చూడకున్నా తెలంగాణా!
నిలిచాడు ప్రతిహృదయానా!!

నిధుల జాడలేకుండే!
ధరలు పెరిగిపోతుండే!!

నియామకాలు లేవు!
ఉద్యోగాలు లేవు!!

కుటుంభ పాలనాయే!
అవినీతి పెరిగి పోయే!!

అప్పులు పెరిగిపోయే!
అభివృద్ధి తగ్గిపోయే!!

ఆశయాలు తగ్గిపోయే!
అలసత్వం పెరిగిపోయే!!

రాష్ట్రం విడిపోయినా!
బానిస బ్రతుకులాయనా!!

తేవాలి చైతన్యం!
ప్రజలలో ప్రతినిత్యం!!

కదలాలి నేటి తరం!
వదిలించాలి జాడ్యం!!

- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్









0/Post a Comment/Comments