చిరునవ్వుల జీవితం ..!
చిరునవ్వుల సిరి మల్లెలతో
జీవితాన్ని పలుకరించి చూడు..!?
ఎప్పుడూ..బాధల
గాథలేనా ,ఉన్న ఈ ఏకైక జీవితానికి..!??
ఒక్కసారైనా మర్చిపోయే
ప్రయత్నం చేద్దాం..!?
దు:ఖాలను ఇలానైనా
ఆపుచేసే ప్రయత్నం చేద్దాం..!??
ఏ క్షణం సముద్ర ప్రయాణ మో..!?
ఏ క్షణం పూల వనమో..!?
అర్థం కాని,
అర్థం చేసుకోలేని..
సందిగ్ధం నెలకొంటున్న జీవితం ఇది..!?
చిరునవ్వుల మొగ్గలు ఏ కాస్తైనా విచ్చు కోనీ..!?
జీవితం సమస్యల సుడిగుండంలో చిక్కుకుని
ఎంత కాలమని విలవిల లాడేది..!??
కొద్దిలో కొద్దిగానైనా..
ఋతువులా మారని..!?
ఆశల పల్లకిలో కాస్తయి నా ..ఊరేగించనీ..!??
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా,
తెలంగాణ