మన వ్యవసాయం పుట్టుపూర్వోత్తరాలు . గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా .

మన వ్యవసాయం పుట్టుపూర్వోత్తరాలు . గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా .

మన వ్యవసాయం పుట్టు పూర్వోత్తరాలు


      దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మన మహాకవి గురజాడ"తిండి కలిగితే కండ కలదోయ్. కండ కలవాడే మనిషోయ్ అని గూడా చెప్పారు. మట్టిని నమ్ముకున్న మనిషి తన కాయ కష్టంతో తనలోని సర్వాంగాల శక్తిని వ్యయం చేసి హలంతో పొలాన్ని దున్ని, విత్తనం నాటి, పంట చేతికొచ్చే వరకు అతను చేయు సాధన కృత్యమే వ్యవసాయం.

       ప్రధానంగా వ్యవసాయం చేయుటకు భూమి, విత్తనం, ఎరువులు, నీరు, పనిచేయు పరికరములు అవసరమని మనందరకు తెలిసిన విషయమే. వ్యవసాయానికి ఆధార భూతమైన ఈ భూమి, నీరు, విత్తనం, ఎరువులు ఎలా పుట్టాయో, వాటి ద్వారా వ్యవసాయం ఎప్పుడు ఎలా ప్రారంభించబడిందో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతాం. వాటి మూలాలను తెలుసుకోవడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

            ప్రపంచ జనాభా ఏ టేటికి పెరిగిపోతూనే ఉంది. ఆహార సమస్య కూడా  పెరుగుతూనే ఉంది. వ్యవసాయం చేసే రైతుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది. ఉన్న జనాభాలో కేవలము 25% మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని అంతర్జాతీయ సర్వే బృందం తెలిపింది. తక్కిన 75% రైతులు వ్యవసాయ మూలాలు తెలుసుకోకుండా గుడ్డిగా వ్యవసాయం చేస్తున్నారని వారు తెలియజేశారు. కొన్ని దశాబ్దాల క్రితం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని సాధించిన మన రైతులు ఇప్పుడు కొన్ని ఆహారపదార్థాల ఈ విషయంలో పరదేశ లపై ఆధారపడడం మనం చూస్తూనే ఉన్నాం.

        ఈ వ్యవసాయాన్ని ప్రప్రథమంగా ఆది రేడు మహారాజుకు పుట్టిన 35 మంది కుమారులకు భూపాలురు అనియు వారి సంతతియే కాపు కులస్తులు అనీ, వారి వృత్తి ఇ సేద్యము అని యు ఆదిరేడు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఇతనికి ఆది రేడు, భూపాలుడు, మురుడకపాలుడు అని పేర్లు గలవు. ఈతని ఆయుధం నాగలి. ఇతను తన వంశ అభివృద్ధికై శివుని గూర్చి ఘోర తపమాచరించాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై తన ఆజ్ఞ ప్రకారం గా చంద్రుణ్ణి సస్యములు కల్పించమని, అవి ఎలా అభివృద్ధి చెందాలి బోధించుట కై చంద్రవంశ శిరోమణి అయిన విశ్వమునకు మిత్రుడైన విశ్వామిత్ర మహర్షిని కలువ మని ఆదేశించి మాయమైన నాడు. వెంటనే ఆది రేడు శివునాజ్ఞ ప్రకారంగా విశ్వామిత్ర మహర్షి కలిశాడు. విశ్వామిత్రుడు తన దివ్య దృష్టితో అంతా గమనించి వృషభ మే వ్యవసాయానికి తగినదని, ఆ వృషభాన్ని ఇవ్వమని శివునిని అడగ మంటాడు. రాజు ఆ ప్రకారంగానే శివున్ని కోరగా శివుడు"రాజా ! నీకు వ్యవసాయంలో పరిపూర్ణ జ్ఞానము గల ఒక కుమారుని ప్రసాదిస్తున్నాను. అతని ద్వారా వ్యవసాయ శాస్త్రం భూజనులందరికి అందుతుంది. నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని సెలవిచ్చాడు శివుడు. శివ వర ప్రభావం వల్ల జక్క మా దేవి యందు ఆది రేడుకు ఆగమ రేడు జన్మించాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత అతను తన 35 మంది భూపాలురను తీసుకెళ్లి విశ్వామిత్ర మహర్షి ని కలవగా, విశ్వామిత్రుడు వ్యవసాయ శాస్త్ర విద్యను, జలార్గళ శాస్త్రం విద్యను, పశు పోషణ పాలనా విద్యను, భూ శుద్ధి చేయు విద్యను, విత్తనం శుద్ధి చేయు విద్యను మొదలగు విద్యలను వివరముగా అతనికి బోధించి చి (1. బంగారు తీగలుto దీప సరాలు 117 వరకు) వరిబీజములు,అదనంగా కాయ బీజములు, దుంపల బీజములు, ఆకుకూరల బీజములు ఏక కాలమున ఎలా విత్తవలెనో, వ్యవసాయానికి అనువగు రుతు కాల భేద మర్మం బుల్లెల్ల బోధించి, కామధేను అంశమున పుట్టిన తెల్లని వృషభ రాజమును, తాను పెంటి మహిషము ల నున్న వ్యవసాయానికి పనికి వచ్చు అన్ని ఉపకరణములను నొసంగెను. ఆగమ రేడు తన 35 భూపాలురతో అరకు( నాగలి) ధరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సదాశివుల ను కల్పిత నామముల చే చెప్పబడును నామ నిర్ధారణ లేని, నిర్మల నిరాకార పరబ్రహ్మ సృష్టించిన ధరిత్రిని దున్ని విశ్వామిత్రుడు ఓ సంగిన విత్తనాలను నాటి వ్యవసాయ కార్యక్రమ వృత్తికి  పునాది వేశాడు. 

   అలా వ్యవసాయానికి అప్పటినుండి బీజం పడి దిన దిన ప్రవర్త మానమై యుగయుగాలను దాటుకుంటూ ఈ విశ్వానికి రకరకాల పంటలను అందిస్తూ సమస్త మానవాళికి ఆహార కొరత లేకుండా అధిగమిస్తూ వస్తూనే ఉంది. 


        ఇవి మన వ్యవసాయం పుట్టు పూర్వోత్తరాలు.

--- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి,
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments