వలపు ఒక వరం..!
పూలలాంటి మనస్సులో
కటువు మాటల ముళ్ళు గ్రుచ్చకు..!
అనురాగం లో అమృతం
మిళితమైనదని గుర్తించు..!
తెగిపోయే గాలిపటం కాకూడదు,
మన బంధం,ప్రేమించు..!
ఎడబాటు గుండె ఎదారును పెంచును,
దూరాన్ని దూరంగా ఉంచు..!
ఎన్ని యుగాలైనా ప్రేమన్నది
అజరామరం, ఇష్టంగా భరించు..!
నాదన్నదంతా..నీదే కదా..!?
నా వలపు లోకంలో నీవే నివసించు..!
నిజమైన ప్రేమాభిమానాలు,ఎన్నటికీ వీడిపోనివి..!
సమస్తం నీకే అర్పితం,కాస్త గమనించు..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.