ఆనందాల పండుగ-బోనాల పండుగ
ఆషాడంలో బోనం పండుగ
ఆడపడుచులకు.. ఆనందాల పండుగ
పల్లెల్లో కోలాహలం.. చిన్న పెద్దలకు ఆహ్లాదకరం.
వనభోజనాలకు ఏగిరి.. వరాల తల్లినీ కొలువంగా
ముత్యాలమ్మ ,పోలేరమ్మ, ఎల్లమ్మ ,మారెమ్మ మైసమ్మ
గ్రామదేవతల కొలువుదీరిన
పండుగ దినం బోనాల పండుగ..
కొంగు బంగారమై..కోరికలు తీర్చగా..
పల్లెల్లో పట్టణాల్లో ..వాడవాడలా..
ఆడబిడ్డలంతా... బోనం ఎత్తిరి.. శివాలూగిరి
నైవేద్యాలు పెట్టిరి... మొక్కులు తీర్చిరి..
కరోనా మహమ్మారి ని కడతేర్చమని.. వెడేరు..
కంటికి రెప్పలా కాపాడమని కోరెరు.
అన్నదమ్ముల, అక్కచెల్లెలను
అన్నపూర్ణ వోలె.. ఆదుకోమని అడిగేరు.
ముగ్గురమ్మల మూలపుటమ్మవై..
మా కష్టాల కడలిలో కాపాడగా కనకదుర్గమ్మ వై
మము దీవించగా.. కన్నతల్లివై కరుణించవా.!
మామ భద్రంగా చూడవా! ఓరుగల్లు భద్రకాళి వై..
మా ఇంట ధనరాశులు కురిపించవా, ధనలక్ష్మివై
మా దుఃఖాలు బాపవా మాతంగి వై
మా పిల్లలను లాలించవా.. లలితాంబ వై
చల్లంగా చూడవా సంతానలక్ష్మివై
సుఖసంతోషాల నివ్వవ సంతోషివై
జనులందరి బాగోగులు చూడవా జగన్మాత వై
ప్రతి యేడు బోనాలు చేసేము
సకల భోగభాగ్యాలు ఇవ్వవా ..
దండాలు దండాలు పరిపరి దండాలు..
అందుకో.. మా తల్లి .. మహాలక్ష్మి వై..
నూరేళ్లు బతకాలని దీవెనలందించు..
రచన: ఇమ్మడి రాంబాబు ,తొర్రూరు
అధ్యక్షుడు మహబూబాబాద్ జిల్లా
తెలంగాణ సామాజిక రచయితల సంఘం