అక్షర కవిత
క మ ల నా భా క న గ రా వా
కలలు కన్న భవిష్యత్తు
క కలలో బంగారు భవిష్యత్తు ఊరిస్తుంటే
మ మదిలో దానిని చేరాలనే ఆరాటం
ల లక్ష్య సాధనే ద్యేయంగా
నా నాపాదాల పయనం సాగేవేళ
భా భాధ్యతల బరువులు హెచ్చరిస్తున్న
క కలల లోకంలో నా ఆశల తీరం
న నన్ను రమ్మని పిలుస్తూ ఉంటే
గ గమ్యం కోసం నా ఎడతెగని పోరాటం
రా రాబోయే కలల ఫలాలకు అందించాను నా ఆహ్వానం
వా వారధిని నేనై నిర్మించుకున్న నా బంగారు కలల భవిష్యత్తు సామ్రాజ్యం.
శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు: హైదరాబాద్
వృత్తి:బిజినెస్ కన్సల్టెంట్