కైవల్యప్రాప్తి

కైవల్యప్రాప్తి

కైవల్యప్రాప్తి
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్


వెంటేశ్వరా!శ్రీనివాసా!
కావగ రావా!
కరుణాలయ!
క్రియాశూన్యుడనై నిల్చున్నాను.
మోక్షమునకై వేడుతున్నాను.
పరమపథం వైపు నన్ను కొనిపో!
నీవే దిక్కని,నీ సమక్షమే
శాంతియని‌ నమ్మాను.
ఆర్తిగా ఎదురుచూస్తున్నాను.
దుఃఖంతో వచ్చిన కన్నీళ్ళతో
నీ కాళ్ళు కడుగుతున్నాను.
లౌకికబంధాలు లెంపలేస్తుంటే,
విషయవాంఛలు వెంబడిస్తుంటే,
నారాయణా! నీ దరి చేర
నన్ను కరుణించవయ్యా!
కళ్ళు తెరిపించి,కాంక్షల చెరిపి,
పరంజ్యోతివై కన్పిస్తున్నావు.
ముక్తిని కల్గించి,ముగించవయ్యా!
శక్తిని హరించి,నిన్ను చేర్చుకోవయ్యా!
నివేదనగొని,నీ పని కానియ్యి!
చెవిలో పేరు చెప్పి,
వైకుంఠధామాన్ని చేర్చి,
కట్టె కాల్చి,ఆత్మ విమోకము గావించి,
కపాలమోక్షమొనరించి
బూడిద చేసి,కొనిపోవయ్యా!




0/Post a Comment/Comments