ఆ కొండ బరువెంత ?...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఆ కొండ బరువెంత ?...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఆ కొండ బరువెంత ?

పేరుకు నాస్తికుడే
భగవంతుడు ‌లేడని
నిరూపించేందుకు
ప్రపంచదేశాలన్నీ
చుట్టి వచ్చిన
పురాణ ఇతిహాసాలను
పుక్కిట పట్టిన
అన్ని మతగ్రంథాలను
నాలుగువేదాలను
నమిలి మింగిన
తర్కశాస్త్రంలో‌
తలపండిన
నాస్తికుడొకడు

కొండ పైకెక్కాడు
..."కొండ ఎత్తును" కొలిచి
ఎగిరి గంతేశాడు

..."కొండ పొడవును"కొలిచి
పొంగిపోయాడు

..."కొండ వెడల్పును" కొలిచి
తనకన్నా శక్తిమంతుడు
తనకన్నా జ్ఞానసంపన్నుడు
ఇంకా ఈ పుడమిపై పుట్టలేదని
విర్రవీగిన ఆ నాస్తికశిఖామణి

..."కొండబరువెంతో" తెలియక
దాన్నెలా తూకంవేయాలో
అర్థంకాక జుట్టు పీక్కున్నాడు
గిజగిజ తన్నుకున్నాడు
కాకిలెక్కలేసి ఖంగుతిన్నాడు
కడకు కళ్ళు తెరుచుకున్నాడు

ఆ మర్మం ఆ పరమాత్మకే‌
ఎరుకన్న నిజం తెలుసుకుని
అర్థించి కన్నీటితో ప్రార్థించి విధిలేక
భగవంతున్ని భక్తితో వేడుకున్నాడు
ఆ "కొండ...బరువెంతో"...చెప్పమని‌

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502 

0/Post a Comment/Comments