ఓ చెల్లీ ! నా బంగారు తల్లీ !...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఓ చెల్లీ ! నా బంగారు తల్లీ !...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఓ చెల్లీ ! నా బంగారు తల్లీ !

ఏ అమాయకత్వమో ఏ అభిమానమో ఏ ఆకర్షణో
ఏ ఆవేశమో ఏ ప్రేమనో ఏ కామవికారమో ఏమో
నేరం నాది కాదు ఆకలిదన్నట్టు నీ అల్లరివయసు
నీ చిలిపిమనసు కలిసి చేసే "ఒక చిన్ననేరానికి" రేపు
నీ బ్రతుకు నీకు...భారమౌతున్నది
నీ పరువు నీకు...దూరమౌతున్నది
నీ ముందుజీవితం...అంధకారమౌతున్నది

అందుకే ఓ చెల్లీ ! నా బంగారు తల్లీ !
క్షణికావేశంలో నీవా నీతిమాలిన
నీచకార్యానికి ఒడిగట్టేముందు...
నీవా బురదగుంటలో మునిగే ముందు...
నేడు నీ గురించి ఎన్నో కమ్మనికలలుకనే
నీ"అమ్మానాన్నల" గురించి ఒక్కక్షణమాలోచించు!

నిన్న నీ నుండి ఏ ప్రతిఫలమాశించకుండా
నీకు బంగారు భవిష్యత్తు ప్రసాదించిన
ఆ "భగవంతున్ని" ఒక్కక్షణం మదిలో స్మరించు!

నీవు చేసిన చిన్ననేరానికి రేపు నీకు పెద్దశిక్షను విధించే
"సభ్యసమాజం" ఒకటుందని ఒక్కక్షణం గుర్తు‌చేసుకో !

నీవు ఊబిలోకి జారి ఉక్కిరిబిక్కిరై పోకుండా
నీవు ఏ అగ్నిగుండంలో పడి ధగ్దమైపోకుండా
నీవు ఏ‌ సుడిగుండంలో చిక్కుకోకుండా
ఏ అనకొండా నిన్ను మ్రింగివేయకుండా
ఏ పిడుగు‌ నీపై నీ కుటుంబంపై పడకుండా
ఏ పులినోటికి‌ చిక్కక జింకలా తప్పించుకునే
చిరుచిట్కా ఒకటి చిత్తంలో వెలిగించుకో...ఏదేమైనా
ఓ చెల్లీ ! నా బంగారు తల్లీ ! తస్మాత్ జాగ్రత్త !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502 

0/Post a Comment/Comments