సుప్రభాత శుభవేళ
కాఫీ తోనే అక్షర సేద్యం మొదలవుతుంది...
ఖవనానికి నాంది కాఫీ..
దిన పత్రిక చదవడానికి కాఫీ
దినచర్య కు తొలి పానముకాఫీ
ఫిల్టర్ కాఫీ బ్రూ కాఫీ నెస్కాఫీ..
సన్ రైజ్ కాఫీ.. స్టార్బక్స్.... విదేశీ కాఫీలు స్వదేశీ కాఫీలు...
కాఫీ లేనిదే కాయం నడవదు...
బ్రతుకు గడవదు.... కాఫీ ప్రాణులు మేము... కాఫీ కలకాలం వర్ధిల్లు.... నీ పీ నంతో మా ప్రాణం కళకళలాడు..
కాఫీ ప్రవచనం పూర్తయింది
చాయ్....వచాయ్.. వేడి వేడి చాయ్.... అచ్చ తెలుగులో తేనీరు ..
సాయం సమయానికి సంధ్యా కాలానికి ముందుగా టీ టైం తేనీరు కాలం.... గరం గరం చాయ్... గర్వంగా తాగెయ్...
ఆనందించు సదా.... తలనొప్పులు మది నొప్పులు గాయబ్.... సాహిత్యానికి తేనీరు... సంగీతానికి పన్నీరు.... చాయ్ కాఫీ లు ఎక్కడ పుట్టినా అందరి దోస్తులు.... ప్రాణమిత్రులు ...
పాన ముఖ్యులు... జయహో కాఫీ జయ జయహో చాయ్.... అందరి మనసులు దోచిన మీకు సదా వందనములు...
పేరు :శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు :హైదరాబాద్
ప్రక్రియ:వచనం