పూజనీయులు " గురువులు"----గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

పూజనీయులు " గురువులు"----గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

పూజనీయులు " గురువులు"
-----------------------------------
ఉదయించే సూర్యులు
లోకంలో గురువులు
అజ్ఞానం తొలగించే
విజ్ఞాన జ్యోతులు

జగతి ప్రగతి బాటలో
గురువర్యులు ప్రథములు
శిష్యుల జీవితాలకు
వెలుగు  వారి పలుకులు

గౌరవనీయులిలను
సభ్య సమాజంలో
వారి పాత్ర అమోఘం
దైనందిన బ్రతుకులో

సమాజ శ్రేయస్సును
కోరుతారు గురువులు
త్యాగానికి గురుతులు
వారు చేయు సేవలు

"గురువు లేని విద్య
గ్రుడ్డిది" అన్నారు
ఈ నానుడి ఎల్లరు
చెవులారా విన్నారు

గుండె గుడిలో గురువును
మనసారా పూజించు
కృతజ్ఞతలు చూపించి
అనుదినము ప్రేమించు

చీకటిని తరిమికొట్టి
వెలుగు దారి చూపించు
ఆధ్యాత్మిక మార్గాన
ముక్తిని ప్రభోదించు

గురు పౌర్ణమి రోజున
భక్తితో ప్రణమిల్లు
దేదీప్యమానంగా
జీవితం శోభిల్లు
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
          ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments