ఊహల దొర సి.నా.రె. గారికి నివాళి
ఉత్తమ ఉపాధ్యాయ వృత్తినెంచి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
ఓ ఆచార్యునిగా వన్నెకెక్కిన వన్నెల దొర
తన కవితా నైపుణ్యం తో
ఎందరి హృదయాలనో దోచిన దోర
ఎందరి కన్నుల్లోనో దాగిన కవీశ్వరులు
పైన కఠినమనిపించు
లోన వెన్నకనిపించు
ఓ నల్లని రాళ్ళలోనూ కన్నులను
కనుగొన్న కవి
ఉలి అలికిడికి ఆరాళ్ళు
పరవశించటం ఏమిటి
ఉలిదెబ్బలు కూడ తట్టుకొనేది
ఓ దేవతా మూర్తిగా వెలసి
పూజలందుకొనే సదుద్దేశ్యంతో కదా!
మల్లియలారా... మాలికలారా..మౌనముగా వున్నారా...అంటూ.. ఆవేదన వాటితో పంచుకుంటాడు
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది...అంటూ జాతిని ఉత్తేజితం చేస్తాడు
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఇంకా తెలవారదే ఈ చీకటి విడిపోదే
అంటూ
బలే మంచి పసందైన రోజుకు ఎదురు చూస్తాడు
ఎవరన్నారవి కన్నులనీ అరెరె మధువొలికే గిన్నెలవి అనిపిస్తాడు
అందమైన జమున కనులపై
అంతే అందమైన యన్.టి.ఆర్. చే
జాలి గుండె లేని కొడుకు కన్న
కుక్క మేలు అంటాడు
వేదనతో ఓతండ్రి ఆవేదన చూసి
అందమైన ఓ సుందరి నడకలో
రాజహంస అడుగులు
నవ్వులో సన్న జాజి పువ్వులను చూస్తాడు
జడలో మల్లెపూల జాతరచేసె ఇంతుల సంగతీ పూబంతుల సంగతీ తెలిసిన శృంగారుడు...
పగటిపూట చంద్రబింబం చూపిస్తాడు
నచ్చిన ప్రియునిలో ఓ ప్రియురాలికి
పగడాల జాబిలి చూడు..
గగనాన దాగెను నేడు ..
కోటి అందాల నా రాణి అందిన యీ రేయి...
ఎందుకులే నెలరేడు అంటాడు
ఓ ప్రియుడు పరవశంతో ప్రియురాలి జూసి
చిరుగాలితో వింజామరలు,
గగనాలలో విరి ఊయలు..
తారకలచే పల్లకి పంపి
చంద్రికలచే పందిరి వేయించి..
ఆ పసిడి పందిళ్ళలో ...ప్రేయసీ ప్రియులను కలుపు ఊహాసుందరుడు...
ప్రియురాలి నడకలో రాజహంసను
ఆ నవ్వులో సన్నజాజి పువ్వుల్ని
చూపిన సరసుడు
విషాదం పండించగల ఓ తత్వవేత్త
ఒక దీపం వెలిగింది...అంటాడు
ఆ ప్రేమ విఫలమై న వేళ
ఒక దీపం మలిగింది, ఒక రూపం తోలగిందీ
వేకువ ఇక లేదని తెలిసి,చీకటితో చేతులు కలిపి అంటాడు
ఏకవీర లో అద్భుతమైన సాహిత్యం అందించిన మేటి
ఓ సినిమాలో వేశ్యలపై స్సందిస్తు
ఎవరు వీరు....
మనసు పిడికిలిలో నలిగిన పువ్వులు
ఆకలికి అమ్ముడుబోయిన బొమ్మలు
అని ఆవేదనను వ్యక్తం చేస్తారు
రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాదు
రిక్షావాల జిందాబాద్ అంటూ హైదరాబాద్ అందాలు ఓ రిక్షావానితో చెప్పిస్తారు
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలుచూపు సోకగానే తేలిపోదురూ
అంటూ ... వయసు మీరిన వారిని ఆట పట్టిస్తారు.
చిత్రం భళారే విచిత్రం
దుర్యోధనునితో ఓ డూయట్టు
రాజరికపు జిత్తులతో సతమతమయ్యే
రారాజు మదిలో మదనుని సందడి చేయిస్తాడు
అనగనగా ఓ రాజు...అంటూ సరళమైన భాషలో వ్రాయగలడు...
అడవే మయూరి ...
చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన
కరకంకణములు గల గలలాడ అంటూ
నాట్యం తో పాటను నర్తింప చేయగల దిట్ట
ఇలా ఎన్నని చెప్పండి
ఆ సి.నా.రె. గూర్చి చెప్పాలంటే
సినీ కవితలే గాక గజల్స్
మరెన్నో కధలు శీర్షికలు వ్రాసిన మేధావి
అవార్డులా లెక్కకు లేనన్ని
పద్మశ్రీ అయ్యారు,
పద్మ విభూషణుడయ్యాడు
జ్ఞానపీఠ్ అవార్డు పొందిన విజ్ఞాన గని
తను వ్రాసిన ఓ పాటకు ముగ్గులై
సినీ దిగ్గజం యన్టీఆర్ ఓరోజు
కారు వరకూ వచ్చి డోర్ తెరిచి సాగనంపటం అది పాండిత్యాకి ఇచ్చిన గౌరవం అంటారు...వినమ్రతతో
ఇలాంటి మేటి కవిని
ఓ మారు స్మరిద్దాం
ఈ ఉద్ధండుని జయంతి నేడు..
ఈ తెలంగాణ ముద్దు బిడ్డకు
తెలుగు జాతి వెలుగు బిడ్డకు జోహార్లు!
డా వి.డి .రాజగోపాల్
9505690690
ఉత్తమ ఉపాధ్యాయ వృత్తినెంచి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
ఓ ఆచార్యునిగా వన్నెకెక్కిన వన్నెల దొర
తన కవితా నైపుణ్యం తో
ఎందరి హృదయాలనో దోచిన దోర
ఎందరి కన్నుల్లోనో దాగిన కవీశ్వరులు
పైన కఠినమనిపించు
లోన వెన్నకనిపించు
ఓ నల్లని రాళ్ళలోనూ కన్నులను
కనుగొన్న కవి
ఉలి అలికిడికి ఆరాళ్ళు
పరవశించటం ఏమిటి
ఉలిదెబ్బలు కూడ తట్టుకొనేది
ఓ దేవతా మూర్తిగా వెలసి
పూజలందుకొనే సదుద్దేశ్యంతో కదా!
మల్లియలారా... మాలికలారా..మౌనముగా వున్నారా...అంటూ.. ఆవేదన వాటితో పంచుకుంటాడు
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది...అంటూ జాతిని ఉత్తేజితం చేస్తాడు
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఇంకా తెలవారదే ఈ చీకటి విడిపోదే
అంటూ
బలే మంచి పసందైన రోజుకు ఎదురు చూస్తాడు
ఎవరన్నారవి కన్నులనీ అరెరె మధువొలికే గిన్నెలవి అనిపిస్తాడు
అందమైన జమున కనులపై
అంతే అందమైన యన్.టి.ఆర్. చే
జాలి గుండె లేని కొడుకు కన్న
కుక్క మేలు అంటాడు
వేదనతో ఓతండ్రి ఆవేదన చూసి
అందమైన ఓ సుందరి నడకలో
రాజహంస అడుగులు
నవ్వులో సన్న జాజి పువ్వులను చూస్తాడు
జడలో మల్లెపూల జాతరచేసె ఇంతుల సంగతీ పూబంతుల సంగతీ తెలిసిన శృంగారుడు...
పగటిపూట చంద్రబింబం చూపిస్తాడు
నచ్చిన ప్రియునిలో ఓ ప్రియురాలికి
పగడాల జాబిలి చూడు..
గగనాన దాగెను నేడు ..
కోటి అందాల నా రాణి అందిన యీ రేయి...
ఎందుకులే నెలరేడు అంటాడు
ఓ ప్రియుడు పరవశంతో ప్రియురాలి జూసి
చిరుగాలితో వింజామరలు,
గగనాలలో విరి ఊయలు..
తారకలచే పల్లకి పంపి
చంద్రికలచే పందిరి వేయించి..
ఆ పసిడి పందిళ్ళలో ...ప్రేయసీ ప్రియులను కలుపు ఊహాసుందరుడు...
ప్రియురాలి నడకలో రాజహంసను
ఆ నవ్వులో సన్నజాజి పువ్వుల్ని
చూపిన సరసుడు
విషాదం పండించగల ఓ తత్వవేత్త
ఒక దీపం వెలిగింది...అంటాడు
ఆ ప్రేమ విఫలమై న వేళ
ఒక దీపం మలిగింది, ఒక రూపం తోలగిందీ
వేకువ ఇక లేదని తెలిసి,చీకటితో చేతులు కలిపి అంటాడు
ఏకవీర లో అద్భుతమైన సాహిత్యం అందించిన మేటి
ఓ సినిమాలో వేశ్యలపై స్సందిస్తు
ఎవరు వీరు....
మనసు పిడికిలిలో నలిగిన పువ్వులు
ఆకలికి అమ్ముడుబోయిన బొమ్మలు
అని ఆవేదనను వ్యక్తం చేస్తారు
రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాదు
రిక్షావాల జిందాబాద్ అంటూ హైదరాబాద్ అందాలు ఓ రిక్షావానితో చెప్పిస్తారు
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలుచూపు సోకగానే తేలిపోదురూ
అంటూ ... వయసు మీరిన వారిని ఆట పట్టిస్తారు.
చిత్రం భళారే విచిత్రం
దుర్యోధనునితో ఓ డూయట్టు
రాజరికపు జిత్తులతో సతమతమయ్యే
రారాజు మదిలో మదనుని సందడి చేయిస్తాడు
అనగనగా ఓ రాజు...అంటూ సరళమైన భాషలో వ్రాయగలడు...
అడవే మయూరి ...
చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన
కరకంకణములు గల గలలాడ అంటూ
నాట్యం తో పాటను నర్తింప చేయగల దిట్ట
ఇలా ఎన్నని చెప్పండి
ఆ సి.నా.రె. గూర్చి చెప్పాలంటే
సినీ కవితలే గాక గజల్స్
మరెన్నో కధలు శీర్షికలు వ్రాసిన మేధావి
అవార్డులా లెక్కకు లేనన్ని
పద్మశ్రీ అయ్యారు,
పద్మ విభూషణుడయ్యాడు
జ్ఞానపీఠ్ అవార్డు పొందిన విజ్ఞాన గని
తను వ్రాసిన ఓ పాటకు ముగ్గులై
సినీ దిగ్గజం యన్టీఆర్ ఓరోజు
కారు వరకూ వచ్చి డోర్ తెరిచి సాగనంపటం అది పాండిత్యాకి ఇచ్చిన గౌరవం అంటారు...వినమ్రతతో
ఇలాంటి మేటి కవిని
ఓ మారు స్మరిద్దాం
ఈ ఉద్ధండుని జయంతి నేడు..
ఈ తెలంగాణ ముద్దు బిడ్డకు
తెలుగు జాతి వెలుగు బిడ్డకు జోహార్లు!
డా వి.డి .రాజగోపాల్
9505690690