శీర్షిక: చైతన్యం
ప్రకృతి పరిమలిస్తున్నవేళా
ఆకాశంలో నీలిమబ్బులు
తెలియాడుతుంటే
మంచు చినుకులు తాకిడికి
లేలేత పూలమొగ్గలు
లతలతో అల్లుకుపోయి
విప్పారుతూ విరబూసిన
అందంతో మనసుతో
నవవసంతోత్సవం సంబరమైన
అంబరవీదుల పరుచుకుని
సొయాగాలొలకబోస్తున్నది
ప్రకృతికాంత
వీచే గాలికి రాలిపడిన
కుసుమాల పుప్పొడి రేణువులు
అవనిపై అందంగా
మరోలోకపు అంచుల్ని
ముందర పరిచినట్లున్నది
సుందర సుమధుర
నయనానందకర సుందర దృశ్యమది
నా మదిదోచినపసందైన ప్రకృతి రమణీయత
వెచ్చని భానోదయ వెలుగు కిరణాలు
మెల్లగా లోకమంతా వెలుగు పంచుతున్న
మనోహర మహోజ్వల ఘట్టం వీక్షణం
నవజీవన గమనానికి మార్గమది
తరగని చైతన్యం రవికిరణం
సి. శేఖర్(సియస్సార్),
9010480557.