పూల బాలలు
సుందర నందన వనిలో
రసరమ్య విరులు. రకరకాల పూలు...
విద్యాలయంలో వసివాడని పసిడి బాలలు
లక్ష్మీదేవి రూపాలు విరులు
వాగ్దేవి రూపాల బాలలు
పూదోటలో పసిడి మొగ్గలు
అరవిరిసిన మందారాలు
లలితమ్మ మనసుపడే కదంబ పూలు......
సుగంధ పరిమళాల పూలు
పూలతోటలో కల్మషం ఎరుగని చిన్నారులు...
కోకిలమ్మ రాగాలు....
చిన్నారుల పూలతోట జగానికి బంగారు బాట.....
పూల తోట అందానికి పరవశమై
ప్రకృతి మాత ఒడిలో సేద తీరాలి చిన్నారి బాలలతో.....
తుమ్మెదల ఝుంకారం....
పక్షుల కిలకిల రావాలు...
పసిడి బాలల పలుకులు..
బాలల అల్లరి భవితకు పల్లవి
పూల సింగారం పడతికి వెలుగు...... పూలలో బాలల్లో
కొలువై ఉన్న దేవతలకు అక్షర నీరాజనం......
-- శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
ప్రక్రియ వచనం