దుష్ట స్వభావులు..!,ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

దుష్ట స్వభావులు..!,ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

దుష్ట స్వభావులు..!

ఎంత మంచి చేసినా,
దుష్టులు.. 
తమ సర్పగుణాన్ని వదలరు..!
చేసిన మేలు మరచి,
వెన్నుపోటుకు దుష్టులు
 వెనుకాడరు..!?
తమ లోని కాపట్యాన్ని,
పాము కోరల్లో విషం నింపు కున్నట్లు,... కపటులు,
మదిలో దాచుకుంటారు..!
సమయం కోసం.. 
వేచి చూస్తారు., దగాకోరులు..,
దగాచేయడం 
వీరి నరనరాల్లో నిలిచి ఉంటుంది..!
క్రూర మృగాల కన్నా,
ఘోరంగా ప్రవర్తిస్తారు..
మిత్రులం అంటారు,పైకి,
చేటు చేయడంలో మాత్రం, ముందుంటారు.. దుష్ట మిత్రులు..!
ఇలాంటి కపటులతో,దుష్ట మిత్రులతో.. 
చాలా జాగ్రత్తగా ఉండాలి..!?
నోట్లోనే తీపి,
మదిలో విషం నిండి ఉంటుంది.,
జాగ్రత్త,తస్మాత్ జాగ్రత్త..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.
9705235385.

0/Post a Comment/Comments