పూలకు హాని చేయకు..!
అందంగా ఉన్నాయని పూలను చిదిమే
కుప్రయత్నం చేయవద్దు..!
చెడు తలపులు వద్దే వద్దు.!?
మంచి మనస్సుని,
కలిగి ఉండు..!
స్వచ్ఛమైన మనస్సు
దేవుని ప్రతి రూపం..!
దయ్యం లాంటి ఆలోచనలు
నీ మదిలో,
రానీయవద్దు..!??
అభం శుభం తెలీని మొగ్గలను
మోసం తో తుంచే
పనికి మాలిన
చేష్టచేయవద్దు..!??
నీలో గలీజు కోరికలు..
నీ అంతం కోసం పుడుతున్నాయని గ్రహించు..!?
దిక్కు లేని నీ చావు కోసమే,
పసిమొగ్గల పట్ల నీ ఉన్మాదం..!?
నీకు మతి భ్రమించ బట్టే..
ఈ పిచ్చోల్ల పనికి పోను కుంటున్నావ్.. వెధవ,
పిచ్చి చేష్టలు మాని మంచిగా మసలుకో..!
పసి మొగ్గల జోలికి పోవద్దు..!?
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.