తొలిపొద్దు
నునువెచ్చని రవి కిరణాల తాకిడికి
తొలిపొద్దు సాగరాన ఆదిత్యుడు రాకకు
స్వాగతం చెబుతూ పక్షుల కిలకిల రావాలు
గోమాత ఆశీర్వాదాలు
తూర్పు దిక్కున సింధూర వర్ణాలు
వేకువజామున గుడిలో వేదమంత్రాల ఘోష
ప్రత్యూష పవనాల ఆనంద హేల
రసరమ్య పకృతిలో రమణీయ మేళ
వేకువజామున సాగరం రంగుల నిలయం
సప్త రంగుల సప్త రాగాల హేల
రవి కరణాల ఆగమ శుభ సంబరం
వేల హృదయాల నిరీక్షణ ల వేకువ
గర్భస్థ శిశువు ఎదురుచూపులు
బిడ్డకు వేకువ చూప తపనతో గర్భవతి
వేకువలో మేల్కొని సత్కార్యాలు
సాధించాలన్న యువత
సమస్యల పరిష్కార నిరీక్షణ వేకువ
విద్యార్థి విజయ పరంపరలను
సాధించాలనుకునే వేకువ
జనానికి జగతికి వెలుగునిచ్చే వేకువ
ఆశావాహ దృక్పథం లో మెరిసే హృదయాల వేకువ
జాతిని చైతన్య పరిచే వేకువ కావాలి అందరికీ
ఆశల ఆదర్శాల భవితబంగారు తోవ......
పేరు :శ్రీమతి సత్య మొం డ్రెటి ఊరు :హైదరాబాద్
చరవాణి :9 4 9 0 2 3 9 5 8 1
ప్రక్రియ :వచనం