గురువే కల్పతరువు(పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

గురువే కల్పతరువు(పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

గురువే కల్పతరువు

మానవ జీవిత విజ్ఞాన వైద్యుడు గురువు
మట్టిముద్దను కళాకృతి గా చేయగల కుమ్మరి గురువు
బీడుభూమిలో అక్షర సేద్యం చేసి సస్యశ్యామలం చేసే రైతే గురువు
మనిషిని కడిగిన ముత్యం లా తీర్చిదిద్దేవాడే గురువు

విజ్ఞాన కల్పతరువు 
సమాజానికి తరగని ఎరువు
విజ్ఞానపు పూదోట లో తోటమాలి గురువు
అవని యందు వెలసిన మరొక భాస్కరుడు గురువు

సద్గుణసంపతి సత్కర్మలభోదకుడు
మానవ నైతికవిలువల ప్రభోధకుడు
అక్షరమాలికలు సైతం వర్ణించలేని భావుకుడు
సమసమాజ స్థాపనకు మూలకారకుడు

మానవ జీవన శైలికి సారధి
మంచి చెడుల విచక్షణా వారధి
కర్తవ్య సాధనాల సన్నిధి
విజ్ఞాన లోకపు పెన్నిధి

యుగయుగాలకు ఆదర్శమూర్తి
ప్రతిభ ప్రగతి ల చక్రవర్తి
ఎందరో జీవితాలకు స్ఫూర్తి
ఆ చంద్ర తారార్కం నిలిచే కీర్తి

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు 

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

0/Post a Comment/Comments