గురువే దైవం... శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట

గురువే దైవం... శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట


గురువే దైవం

గురువే దైవ స్వరూపం
వారి మాటే శిరోధార్యం
పుస్తకాలను మస్తకం లో
నింపే వాడే కాదు
ఈ చరాచర జగత్తులో నిండి
ఉన్న జ్ఞానాన్ని పంచేవాడు గురువు
చిరంజీవుడై విద్యార్థి గుండెల్లో
వెలిగే దీపం తాను 
పొందే విజయానికి
తొలి మెట్టు తాను
ప్రగతికి రథచక్రం తాను
నిత్య చైతన్య దీప్తి ప్రకాశం తాను
నిస్వార్థంతో అంధకార చీకట్లు  ప్రారద్రోలి
జ్ఞాన జ్యోతి  వెలిగించే   దీపం గురువు
అక్షర కిరణానికి సంస్కారి గురువు
అక్షరాలతో నుదిటి రాతలను మార్చేవాడు గురువు

---- ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు: హైదరాబాద్


0/Post a Comment/Comments