శీర్షిక:ప్రత్యక్ష దైవాలు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శీర్షిక:ప్రత్యక్ష దైవాలు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

అంతర్జాతీయ తల్లిదండ్రులు దినోత్సవం సందర్భం 

*శీర్షిక:ప్రత్యక్ష దైవాలు*


సృష్టిలో కనిపించే దైవాలు
మనల్ని పెంచే అపురూపాలు
అమ్మ నాన్నలే నిజమైన దైవస్వరూపాలు
మనకంటి రూపాలు

అమ్మ జన్మనిస్తుంది
నాన్న జీవితాన్నిస్తారు
అమ్మ ప్రాణం పోస్తుంది
నాన్న జీవితం ధారపోస్తారు

అమ్మ జీవం
నాన్న త్యాగం
ఒకరికి ఒకరు మమేకం
మన నిజ జీవితానికి వారే ప్రత్యేకం

అమ్మ నాన్న మనకు రెండు కళ్ళు
ఒకరు వీపు ఒకరు కడుపు
ఎన్ని సంపదలున్న జీవితాంతం అమ్మ నాన్నాలు మనతో ఉంటే అదే నిజమైన సంపద
ఏ షరాబు వెలకట్టలేని అమ్మోల్యమైన సంపద తల్లిదండ్రులు

ఒక శ్రావనుడు ఒక సిరియాలుడు
మాతా పితల సేవలకు నిదర్శనాలు
శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శదైవం మాతృదేవోభవ పితృదేవోభవ
ఇవే మన అసలు సిసలైన సిరిసంపదలు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు టీచర్ 
           విజయనగరం జిల్లా
           9441530829

ఇది నా స్వీయారచన. హామీ ఇస్తున్నాను



0/Post a Comment/Comments