యువగళం - దేశ సాధికారత
నా ఒక్కడి వల్లే ఏమవువుతుంది అని
చేతులు ముడుచుకుని కూర్చోవద్దు..
థైర్యం తో ఒక్క అడుగు ముందుకు వేస్తే
వంద అడుగులు నీ వెనక వస్తాయి.
అన్యాయాన్ని గొంతెత్తి చాటు నీ గొంతులో
వేలాది పౌరుల చరణ గీతాలు ఆలాపనై తోడొస్తాయి..
అన్యాయాలకు లొంగకుండా
ప్రలోభాలకు తావివ్వకుండా..
నీలో ఉన్న ఆత్మ థైర్యానికి ప్రజా అండను
తోడు తీసుకుపో...
జరుగుతున్నా అన్యాయాలను వెళుగెత్తి పోరాడు...
దేశభివృద్దే మనద్యేయమని..
దేశరక్షణ మన ఆశయమని ముందు అడుగు వేయి..
నీకున్న హక్కులను వినియోగించుకో...
దేశ భద్రతను కాపాడుకోవడానికి,
నీలో చైతన్యాన్ని ఉసుగొలుపు..
దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు
చేయూతనివ్వడానికి నీవంతు కృషిచేయి..
పారిశ్రామికంగా,ఆర్థికంగా వెనకబాటుతనాన్ని
అందుపుచ్చుకోవలసిన పధకాలకు వివరణనిస్తూ..
అన్ని చేయూత పధకాలు ప్రజలకు అందేలా
నితంతర శ్రామికుడువై ముందుకు దూసుకుపో..
దగాకోరుల వలలోచిక్కుకున్న మానవజాతిని తట్టిలేపు..
నీలోఉన్న ఆవేశాన్ని అణగత్రోక్కకు..
ఆవేశానికి ఆలోచన జోడించి పోరాడు..
పోరాడితే పోయేది ఏమిలేదు
బానిస సంకెళ్ళు తప్ప అని చాటి చెపుతూ...
దేశ అభివృద్ధి యువత చేతిలోనే ఉందని వెలుగెత్తి చూపించు...
--- వి. కృష్ణవేణి,
వాడపాలెం,
తూర్పుగోదావరి జిల్లా.