బడి గంటలు మ్రోగాలి
రోజు 8గంటల నుండి కల కలలాడే బడి వెలవెల బోయింది.కరోనా పుణ్యమా అని బడులుకు సెలవులు ఇచ్చారు. చాలా బాధతో బడి విలపిస్తుంది.బుడి బుడి అడుగుల పిల్లలు నవ్వులు పువ్వులు వెదజల్లుతూ రోజు అమ్మఒడి నుండి వచ్చి నా ఒడి చేరి మారాం చేస్తుంటే నాకు చెప్పలేనంత హాయి కలిగేది..ఆ చిన్నారి చిట్టి పొట్టి మాటలకు ఆట పాటలకీ నా మది ఉప్పొంగిపోయేది.
9గంటలకు పిల్లలు ఉపాధ్యాయులు నా దగ్గర హాజరై ప్రార్ధనా గీతాలతో బడి సమయాన్ని ప్రారంభిస్తున్నపుడు నేను ఎంతో ఆనందించే దానిని.క్రమశిక్షణతో పిల్లలు వరుసలు వారీగా నిలబడి వందేమాతరం మా తెలుగు తల్లి ప్రతిజ్ఞ చివరగా జనగణమన పడినప్పుడు నా హృదయ స్పందనలు నింగిని తాకి ఆనందపడే దాన్ని. సమాజానికి మూల స్తంభాలైన ఉపాధ్యాయులు భావి భారత పౌరులను తీర్చి దిద్దుతుంటే నా మనసు ఆనంద తాండవం చేసేది
సరస్వతి నమస్తుభ్యం అని చెబుతూ నైతిక విలువలు మానవత్వం భిన్నత్వం లో ఏకత్వం గూర్చి ఉపాధ్యాయులు చెబుతుంటే అందుకే కాబోలు ఉపాధ్యాయులు ను గురుబ్రాహ్మ అని గురు విష్ణు అని గురుదేవో మహేశ్వర అని అంటారని గర్వపడతాను.నా ఒడిలో సమ సమాజ స్థాపనకు పునాదులు వేస్తున్నారని ఆనందపడుతున్నాను.
కానీ ఈ కరోనా పరిస్థితులు నన్ను అతలాకుతలం చేశాయి.పిల్లలకు సెలవులు ప్రకటించడం తో నా పిల్లలు నా దగ్గరకు రావడం లేదు. అయినా వారు బాగుండాలి వారి ఆరోగ్యం బాగుండాలి. రోజు ఉపాధ్యాయులు వచ్చి నన్ను పలకరించుకొని వెళ్తున్నారు.త్వరలో నా పిల్లలు కూడా నా దగ్గరకు రావాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను.మరలా నా బడిగంటలు గణ గణ మ్రోగాలి. నవ్వేపువ్వులు లాంటి బాలబాలికలు నా ఒడి అతిత్వరలోనే చేరాలని కోరుతున్నాను. బాలబాలికలు గులాబీ మాలికలు అన్నారు చా చా జీ.
ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను