వర్ణోపాఖ్యానం(వచనకవిత)
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
చైతన్యానికీ,అభ్యుదయానికీ
సంకేతమై,
విప్లవానికి,మార్పుకు నిదర్శనమై,
పీడిత,తాడిత ప్రజల పక్షాన నిలబడ్డ అండై,
దోపిడిదారులకు,భూస్వాములకు సింహస్వప్నమై,
మరోశకానికి మహోదయమై,
దౌర్జన్యానికి,అణచివేతకు ఎదురొడ్డి నిలిచే ధ్వజమై,
పోరాటాలకు,త్యాగాలకు నినదించిన ప్రణవమై,
జననానికీ,మరణానికీ జీవమై,
ఎరుపెక్కిన చెక్కిళ్ళకు,
పాదాల పారాణికి,
అరచేతుల్లో పండే అందానికి,
వేటాడే జంతువుల క్రూరత్వానికి,
నుదుట వెలిగే బొట్టుగా,
అరుణోదయ బింబానికి,
అస్తమయ అందానికి ప్రతిరూపాలై,
అస్త్రమై,ఆలంబనమై నిలుస్తుంది.