ఏదో ఒక ఆలోచన మదిలో మెదిలింది..!
ఎన్నో , ఎన్నెన్నో ఊహల్లో వర్ణాలు, ఊసులు నిగనిగ లాడతున్నాయి..!
కన్నెత్తి చూడగా ఊహా జగత్తు లో విహరిస్తూ ఈ సమయాన్ని ఆహ్లాదంగా గడిపేస్తున్నాను..!
ఆ ఎత్తయిన కొండలు, లోయలు దాటుతూ..
కూని రాగాలు తీస్తూ.. నడక సాగిస్తున్నాను..!
చిన్ని చిన్ని ఆ తోటల చెట్ల కొమ్మలు-రెమ్మలు,
పువ్వులు పరిమళాలు వెదజల్లడం,
నా మదికి ఎనలేని ఆనందం కలుగజేయడం,
వారెవ్వా.. జీవితాన్ని నేనింతగా అనుభవిస్తున్నాను..!
రచన:-✍🏻
విన్నర్,
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.