కడుపు నొప్పి --- డా. కందేపి రాణి ప్రసాద్

కడుపు నొప్పి --- డా. కందేపి రాణి ప్రసాద్


కడుపు నొప్పి

  --- డా. కందేపి రాణి ప్రసాద్

పింకీ చాలా చలాకీ గల పిల్ల రోజు బడికి చక్కగా వెళుతుంది ఏ రోజూ బడికి పేచీ పెట్టదు అమ్మ నాన్నల గారాబల కూతురు అమ్మ చెప్పినట్లు వింటుంది పింకీ అమ్మ లేపగానే లేస్తుంది స్నానం చేయించి బట్టలు తొడగగానే బడికి తయారవుతుంది అమ్మ పాలు తాగించి బ్యాగ్ తగిలించి ఆటో ఎక్కిస్తుంది ఇదే పింకీ దినచర్య కానీ గత కొన్ని నెలలుగా పింకీ హుషారుగా ఉండట్లేదు అందరితో కలిసి ఆదుకోవడం లేదు మైదానంలో పిల్లలంతా ఉత్సహంగా ఆటలు అడుకుంటుంటే పింకీ మాత్రం  క్లాస్ రూమ్ లో డెస్క్ మీద తల పెట్టుకొని నిద్రపోతుంది బాధగా  మొహం పెడుతున్నది ఈ విషయాన్ని మిగతా పిల్లలు టీచర్లు గమనించారు పింకీ అమ్మానాన్నల్ని పిలిపించి చెప్పారు.

   అవును వాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించారు ఎప్పుడూ స్తబ్దుగా ఉంటోంది చలాకీతనం తగ్గింది పొట్ట పట్టుకొని కూర్చుంటోంది బహుశ పొట్టలో నొప్పి వస్తుందేమో అనుకున్నారు వెంటనే డాక్టరు కు చూపించాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా ఆ మారునాడే  పింకీ ని పిల్లల డాక్టరు ప్రసాదరావు వద్దకు తిసుకెళ్లారు వారి పేరు వచ్చేదాకా నిరీక్షించారు. 

       పింకీ ని చూపించి విషయమంతా వివరించారు అమ్మ నాన్న డాక్టరు గారు పరీక్షించి ఆకలి మామూలుగానే ఉన్నదా అని అడిగాడు లేదు డాక్టరు గారు ఈ మధ్య ఏమి తినటం లేదు అన్నారు సరే అని డాక్టరు గారు తల ఎత్తి అమ్మా నాన్నలతో ఇలా చెప్పారు.

    చూడండి పాపకు పొట్టలో పురుగులు చేరాయి సాధారణంగా నులి పురుగులు చేరతాయి వీటి వలన కడుపులో నొప్పి ఆకలి మందగించడం నీరసంగా ఉండడం ఉత్సహం లోపించడం వంటి లక్షణాలు ఏర్పడతాయి పిల్లలు మట్టిలో ఆడుకోవడం వలన మట్టిలో ఉండే నులి పురుగుల గుడ్లు చేతుల ద్వారా పిల్లల నోట్లోకి చేరతాయి అవి అలా పొట్టలోకి చేరి జీర్ణశయంలో నివాసం ఏర్పరచుకొని పెరిగి పెద్దదై పిల్లల్ని పెట్టుకుంటూ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి విటివలనే  పిల్లలకు కడుపునొప్పి వస్తుంది అందుకే పిల్లలు ఆహారం తినేముందు చేతుల్ని బాగా సబ్బుతో కడగాలి అదేవిదంగా టాయిలెట్ కి వెళ్లివచ్చాక కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి అలాగే శుభ్రపరచిన మంచి నీరునే తాగాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు వీటి బారి నుండి రక్షింపబడతారు అని చెప్పాడు డాక్టరు. 

     వెంటనే అమ్మా నాన్నా ఇప్పుడెలా డాక్టరు గారు అన్నారు అదుర్దాగా

    అమ్మ మీరేం భయపడాల్సిన అవసరం లేదు దీనికి నేను ఒక మందు ఇస్తాను దాన్ని ఈ రాత్రికి రెండు మూతలు తాగించండి సరిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకు పూర్తిగా తగ్గిపోతుంది కానీ పిల్లలు పరిశుభ్రంగా పనులు చేసుకునేలా తర్ఫీదు ఇవ్వాలి పిల్లల గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించాలి చేతులు కడిగినప్పటికీ గోళ్ళలో మాలినాలు ఇరుక్కుంటాయి ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు వెళ్లి రండి అన్నాడు డాక్టరు. 

     నమస్కారం డాక్టరు గారు చాలా విషయాలు తెలియజెప్పారు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాం మీరు చెప్పినవన్నీ పాటిస్తాం అంటూ వెళ్లిపోయారు. 

      ఇంటికి వెళ్లి రాత్రి మందు తాగించారు తర్వాత రోజు పింకీ కడుపు నొప్పి అనలేదు నాలుగురోజుల తర్వాత అమ్మా నాకు ఆకలేస్తుంది అంటూ అన్నం పెట్టమని అడిగింది ఇంకా నాలుగు రోజులు పోయాక పూర్వం లాగా తోటి పిల్లలతో లేడీగా ఆడటం మొదలుపెట్టింది ఎప్పుడూ స్తబ్దుగా ఉండటం లేదు లేడీ పిల్లలా గెంతుతూనే ఉన్నది పూర్తి ఆరోగ్యంగా సాధారణ స్థితికి వచ్చింది పింకీ నిలా చూసిన అమ్మానాన్నలు చాలా సంతోషపడ్డారు తాము తెలుసుకున్న విషయాలను ఇరుగు పోరుగుకు చెప్పి వారినీ చైతన్య పరిచారు పింకీ మళ్ళీ ఎప్పుడూ జబ్బుపడలేదు ఆనందంగా గెంతుతూ ఉత్సహంగా ఉంది.

0/Post a Comment/Comments