అల నీలి గగనాన
ఆకాశ వీధిలో అందాల తారలు
కొలువు తీరిన వేళ తారా చంద్రుల సరసకేళి విలాసం
వీక్షించ ఆనంద భాష్పాన
మునిగె నా మది....
కనులార మిము కాంచిన కన్నులే కనులు...
నా మేను తుళ్లింతలతో ..
మనసు పులకరింతలు తో
మై మరచి పులకరిస్తుంది.
ఏ కవి కలానికి అందని చిత్రం
శిల్పకార ఉలి కిలొంగనిది
సాంకేతికతకు సాధ్యం కానిది
శాస్త్రవేత్తలు సృష్టించలేనిది
గగనతల సౌందర్యం
ప్రకృతి కి మాత్రమే సొంతం
ఆకాశదేశాన వెలిగే సిరిదీపాలు
ఆనందానికి నిలయాలు..