నాన్నా! ఓ నాన్నా!
--- డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,సికింద్రాబాద్.
పల్లవి:
******
నాన్నా! ఓ నాన్నా!
నీ మనసే వెన్న!
నీవిచ్చిన ఈ జన్మ
మరువను నాన్నా!
చరణం:1
*******
జన్మకు కారణమైన నీవు
లోకం చూపించావు!
ప్రేమను పంచావు
బాధ్యత నేర్పావు!
భయము వద్దన్నావు
అండగా నిలబడ్డావు!
(నాన్నా! ఓ నాన్నా!)
చరణం:2
*******
నిత్యం కష్టపడీ
కుటుంబాన్ని నిలబెట్టీ
అడిగిందల్లా ఇచ్చీ
మిత్రుడివై నడిచీ
అవిశ్రాంత సేవకుడవయ్యావు!
విలువలకు నిదర్శనమయ్యావు!
(నాన్నా! ఓ నాన్నా!)
చరణం:3
********
నీవంటే భయమున్నా
నీవుంటేనే సంతోషం!
నీవంటే క్రమశిక్షణైనా
నీతో నడిస్తేనే రక్షణ!
నీవే ఒక గ్రంథం
లేదు సరిసమానం!
(నాన్నా! ఓ నాన్నా!)
చరణం:4
*******
నిజమూ నీవే
మార్గమూ నీదే!
ఆదర్శం నీవే
అణువణువూ ఉన్నావు!
ఆశీర్వదిస్తున్నావు
ఈ జీవితం నీవిచ్చిన బహుమానమే!
(నాన్నా! ఓ నాన్నా!)