'భూమికి భారం!'(వచన కవిత)
అవసరాలు తీరక
వనరులు సరిపోక
కరువు కాటకాల నడుమ
నరక సదృశ కుటుంబ జీవనం..
సమాజానికి, దేశానికి శాపంగా మారుతుంది..అధిక జనాభా వల్ల
ప్రకృతి వైపరీత్యాలు..
పర్యారణంలో మార్పులు..
సమతుల్యత లేని వాతావరణ పరిస్థితులు..
ఆర్ధిక ఇబ్బందులు..
ఆహార, ఆరోగ్య, ఆక్సిజన్ కొరతలు..
ఎండుతున్న జలాలు
నిండుకున్న స్థలాలు..
భూమికి భారం..
నివాసం కోసం
మరో గ్రహంలో ఆవాసం..
ప్రశ్నార్థకంగా మారిన భావి జీవితాలు..
నియంత్రణ లేని జనాభా
పర్యావరణానికి శాపం
జనజీవన స్తంభన కారణం!
--సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.