సమయపాలన --- శ్రీమతి సత్య మొండ్రెటి

సమయపాలన --- శ్రీమతి సత్య మొండ్రెటి

సమయపాలన

సక్రమమైన జీవితానికి సమయపాలన పాటించడం అవసరం.
మూడు కాలాలు ఆరు ఋతువులు సమయ కాల చక్రాలు.
వాటికి అనుగుణంగా మనిషి జీవన అలవాట్లు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి
ఆ కాల సమయాన్ని బట్టి తమ నిత్యావసరాలను సమయానుకూలంగా అనుసరిస్తాడు......
సమకాలీన పరిస్థితులను బట్టి దానికి తగ్గట్టుగా జీవన విధానాన్ని రాజకీయ పరిస్థితులను సాంఘిక ధర్మాలను పాటిస్తాడు.....
సమయాన్ని విభజించి సొంత కార్యాలకు కొంచెం దేశ సమస్యలకు, సమాజ సేవ లకు సేవలకు... వినియోగిస్తాడు సమయాన్ని.
కుటుంబ క్షేమమే దేశ సంక్షేమం కుటుంబం కోసం సమయాన్ని కేటాయించి పిల్లల భవిష్యత్తుకు ప్రణాళిక వేస్తారు
కష్టకాల సమయాన్ని ఓర్పుతో
నేర్పుతో తట్టుకొని నిలబడతారు.
సుఖాలలో సమయాన్ని సంతోషంతో సద్వినియోగం చేసుకుంటారు
సోమరిగా ఉన్న వారి కోసం సమయం నిలవదు సమయాన్ని ఎవరు ఆపలేరు... సమయానికి అనుకూలంగా మనమే మారాలి సమయపాలనతో సద్వినియోగం చేసుకోవాలి పదిమందికి మేలు చేయాలి అందరి సమయం బాగుండాలి అందులో మనముండాలి.....
సర్వేజనా సుఖినోభవంతు...

--- శ్రీమతి సత్య మొం డ్రెటి,
హైదరాబాద్,
ప్రక్రియ: వచనం.

0/Post a Comment/Comments