ఏమిటో ఈ పద్ధతి..!? ---ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

ఏమిటో ఈ పద్ధతి..!? ---ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

ఏమిటో ఈ పద్ధతి..!


నిత్యం అల్లర్లు,
జగడాలు, రాస్తా రోకో లు,
నిరసనలు, ఆందోళనలు,
రోడ్డు పై బైటాయిపులు,
ట్రాఫిక్ అంతరాయాలు..
ఇవే ఇవే దేశ ప్రగతికి దర్పణాలు..!
ప్రతి సమస్యకూ పరష్కార మన్నట్లు.,
రోడ్డెక్కి నిరసనల పర్వం..!
పాదచారులకు,
వాహనచోదకులకు తప్పని తిప్పలు..!
చూడండి..
చూసి సంతోశించండి..!

ఎదిరింపులు, బెదిరింపులు,
అరుపులూ,  
వాగ్వివాదాలు,   
రాళ్ల దాడులు,
కుర్చీలు విరగ్గొట్టడాలు,
ధ్వంసం, విధ్వంసం 
సృష్టించడం..!
తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం..!

విచక్షణ ఎరగని విజృంభణ,
గూండాగిరి,
రౌడీయిజం,
పగ,ప్రతీకారం,
అత్యాచారం,
దారుణ మారణ కాండ,
హింస, దౌర్జన్యాలు,
గ్రూపు గ్యాంగులు, 
రోడ్డెక్కిన తగాదాలు..!
ఇదే,ఇదే,నిజమైన విప్లవం..!
చూడండి..చూసి 
ఆనందపడండి..!???

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments