బాలగేయం:శ్రీమతి ఐశ్వర్య రెడ్డి

బాలగేయం:శ్రీమతి ఐశ్వర్య రెడ్డి

బాల-గేయం
అందంగా ముస్తాబు అవుదాం
---------------------------------------------
నింగిలో చుక్కలను కోసుకొద్దామా
నేలపై మొక్కలుగ నాటుకొందామా
 హరివిల్లునే మనం మోసుకొద్దామా
అందులోరంగులనురాసుకుందామా

మిణుగురు పురుగులను పట్టుకోద్దామా
వాటిలోని మెరుపునంతా అద్దుకుందామా
చంద్రుడిని చేతిలోకి తీసుకుందామా
దానిలోని తెల్లదనం రాసుకుందామా

తునీగ రెక్కల్ని తీసుకోద్దామా
గాలిలో పక్షల్లే ఎగిరిపోదామా
సెలయేటి సవ్వడంతా దాచుకుందామా
ఆ సవ్వడి తో పాట కట్టి పాడుకుందామా

పైరుల పచ్చదనం పట్టుకుందామా
పచ్చని చీరనే చేసి కట్టుకుందామా
చీకటి ని చేతిలో దాచుకుందామా
కళ్లకు కాటుకలా పెట్టుకుందామా. 

పేరు : ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు:హైదరాబాద్



1/Post a Comment/Comments

Unknown said…
బాగుందండి పాట