నేనొక పక్షి..!
నేనొక పక్షినైతే..
హాయిగా నీలాకాశంలో, రెక్కలు రెప రెప లాడిస్తూ,చాలా ఎత్తులో,
ఎగిరేవాణ్ణి..!
ఆ ఎత్తయిన చెట్లపై వాలి..
కాసేపు సేద తీరి..,
ఆ చెట్టు తాజా ఫలములను ఆరగించి,
మళ్ళీ చల్ల గాలి లో హాయిగా ఎగురుతూ విహారం కానిచ్చే వాడిని..!
ఆ మేఘములు కురిపించే చినుకుల్లో తడిసి,
జీవితానందము గావించే వాడిని..!
ఎనలేని ఆనందములు..
నా స్వంత మైనట్లు,...
దూర దూర ప్రాంతాలకు ఎగురుతూ వెళ్లే వాడిని..!
రకరకాల చెట్లపై నిలిచి, ఇష్టమైనట్లు వ్యవహరించే వాణ్ణి..!
అందమైన సూర్యోదయం నాకు దక్కినట్లు..!?
హాయి గొలిపే సంధ్యా సమయం నాకే వరించినట్లు..!?
అందమైన వెన్నెల రాత్రిలో
నిదురించినట్లు..
ప్రతి క్షణం..
ఆనంద
నిలయంగా మార్చుకునే వాణ్ణి..!
ఇంకా నా తోటి పక్షులతో..
పరుగు పందెం..!
ఆటలు పాటలు...!
అప్పుడప్పుడు..పోట్లాటలు.!
జీవితాన్ని,ఉన్న కాలాన్ని,
తనివితీరా అనుభవించే వాణ్ణి..!
ఎవ్వరి ఒత్తిడి లేకుండా హాయిగా స్వతంత్రంగా జీవించేవాడిని..!
ఏ ఎదారూ లేకుండా..
పూటగడిపే వాణ్ణి..!
రచన:-✍🏻విన్నర్
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.