నా అక్షరాలు నవ్వే నక్షత్రాలు...పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్, హైదరాబాద్.

నా అక్షరాలు నవ్వే నక్షత్రాలు...పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్, హైదరాబాద్.

నా అక్షరాలు నవ్వే నక్షత్రాలు

ఆకలి తీరని అక్షరాలు
ఆవలి తీరం చేరని అలలు
రెండూ ఒకటే ఆశపడతాయి
ఆవేశపడతాయి ఆరాటపడతాయి
పడిలేస్తాయి పరుగులు తీస్తాయి
కలం కౌగిట ఒదిగిపోవాలని
అందమైన కవితలుగా అవతరించాలని 
కాగితాల ముంగిట ముత్యాల ముగ్గులై
రత్నాల రాశులై మిగిలిపోవాలని కలలెన్నో కంటాయి

నా అక్షరాలే...నా ఆశ
నా అక్షరాలే...నా శ్వాస
నా అక్షరాలే...నా ఆశయం
నా అక్షరాలే...నా ఆయుష్షు
నా అక్షరాలే...నాకు ఔషధాలు
నా అక్షరాలే...నాకు ఆయుధాలు

నా అక్షరాలే...భావితరాలకు ఆక్సిజన్
నా అక్షరాలే...అమాయకులకు అమృతం
నా అక్షరాలే...అజ్ఞానాంధకారంలో ఆరనిజ్యోతులు

నా అక్షరాలే...ఆకాశంలో వెన్నెల జల్లులు
నా అక్షరాలే...మా అమ్మచేతి గోరుముద్దలు
నా అక్షరాలే...అరుణోదయ కాంతి కిరణాలు
నా అక్షరాలే...మానసిక రుగ్మతలకు మందులు
నా అక్షరాలే...నా అంతరంగాన వెలిగే నక్షత్రాలు

నా అక్షరాలే...సమసమాజానికి పునాది రాళ్ళు
నా అక్షరాలే...నాగురువులు చూపిన బ్రతుకుబాటలో
విరిసిన రంగుల హరివిల్లులు...కురిసిన విరిజల్లులు

నా అక్షరాలే...విజ్ఞానపువిత్తనాలని...సాహితీ క్షేత్రంలో
వెదజల్లి కమ్మని...కవితలపంటలను.....పండిస్తానని
నేడు నేను...నా అక్షరాలసాక్షిగా...ప్రమాణం చేస్తున్నా...

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502


 

0/Post a Comment/Comments